Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ మరో 10 ఏళ్లు ఆడాలి: యోగ్ రాజ్ సింగ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో మరో 10 ఏళ్లు కొనసాగాలని మాజీ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్ అన్నాడు. ధోనీ ఫిట్‌గా ఉన్నాడని, రిటైర్ కావాలని అతనికి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. 6 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ప్రతీ ఐపీఎల్ సీజన్‌కు ముందు ధోనీ రిటైర్మెంట్‌పై వార్తలు వస్తున్నాయి. 44 ఏళ్ల వయసులో ఉన్న ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌లో ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగాలని కొందరంటే.. రెగ్యులర్ ప్లేయర్‌గా ఆడాలని మరికొందరు అన్నారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కూడా కొంతమంది సూచించారు.

తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్ రాజ్ సింగ్..ధోనీకి మద్దతుగా మాట్లాడాడు. తన కొడుకు యువరాజ్ సింగ్ కెరీర్‌ త్వరగా ముగియడానికి ధోనీనే కారణమని యోగ్ రాజ్ సింగ్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇలా అవకాశం దొరికినప్పుడుల్లా ధోనీపై విమర్శలు గుప్పించే యోగ్‌రాజ్ సింగ్ తొలిసారి అతని గురించి సానుకూలంగా మాట్లాడాడు.

Yograj Singh Praises MS Dhoni He Should Play for 10 More Years Blasts Critics Over Retirement

'ధోనీ ఇంకా ఆడుతున్నాడు. మరో 10 ఏళ్ల వరకు అతను ఆడాలి. ఎందుకంటే సరైన క్రమశిక్షణ, అంకితభావంతో తన ఫిట్‌నెస్‌ను అతను నిరూపించుకున్నాడు. అతని మోచేతి చూస్తుంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. అతనో అద్భుతమైన వ్యక్తి. అతను రిటైర్ అవ్వాలని చెప్పడానికి అసలు వేరే వాళ్లు ఎవరు? క్రికెట్ పరంగా అతనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.'అని యోగ్ రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

గతేడాది వికెట్ కీపర్‌గా బరిలోకి దిగిన ధోనీ..చివర్లో వచ్చి బ్యాటింగ్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గైర్హాజరీలో జట్టును కూడా నడిపించాడు. అయితే ఈసారి సంజూ శాంసన్ జట్టులోకి రావడంతో అతనే కీపర్‌గా కొనసాగే అవకాశం ఉంది. ధోనీ మెంటార్‌గా ఉంటూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతోంది.

టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ధోనీ తుది జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా ఆడుతాడని చెప్పాడు. 'సీఎస్‌కే జట్టులో ధోనీ కచ్చితంగా ఆడాలి. అతనికి ఆడటం ఇష్టం లేకపోతే ఎప్పుడో రిటైర్ అయ్యేవాడు. తాను ఆడగలననే 100 శాతం నమ్మకం అతనికి ఉంది. గత మూడు నెలలుగా అతను ప్రాక్టీస్ చేస్తున్నాడంటేనే..తాను ఆడాలనుకుంటున్నాననే సందేశాన్ని పంపిస్తున్నాడు. అతను ఆడాలని అనుకున్నప్పుడు, మీరు వద్దని చెప్పలేరు'అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

Story first published: Friday, March 27, 2026, 16:48 [IST]
Other articles published on Mar 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+