న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీమిండియాకు సెలెక్ట్‌ అయ్యానంటే నమ్మలేకపోతున్నా.. అప్పుడే నా జీవితాన్ని క్రికెట్‌కు అంకితం చేశా'

WTC Finals: Arzan Nagwaswalla says Indias 2011 World Cup victory inspired me to take up cricket

గుజరాత్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ శుక్రవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 20 మంది ప్రాబబుల్స్‌తో పాటు నలుగురిని స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా బీసీసీఐ ఎంపికచేసింది. వారిలో అర్జాన్‌ నాగ్వాస్‌వాలా కూడా ఒకడు. అర్జాన్‌ భారత జట్టుకు ఎంపికైయ్యేందుకు ప్రధాన కారణం అతడు ఎడమచేతి వాటం పేసర్‌ అన్న కారణమే. అంతేకాకుండా అర్జాన్‌ గణాంకాలు కూడా ఎంతో బాగున్నాయి.

బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయడం, ఊరించే లైన్‌ అండ్‌ లెంగ్తుల్లో బంతులు వేసి వికెట్లు తీయడం అతడి ప్రత్యేకత. అర్జాన్‌ బౌలింగ్‌లో ఆడిన అనుభవం మన జట్టు ఆటగాళ్లకే లేదు. ఇక విదేశీ ఆటగాళ్ల సంగతి అయితే మర్చిపోవాల్సిందే.

సెలెక్ట్‌ అయ్యానంటే నమ్మలేకపోతున్నా

సెలెక్ట్‌ అయ్యానంటే నమ్మలేకపోతున్నా

భారత జట్టుకు స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపికచేసిన విషయంపై అర్జాన్‌ నాగ్వాస్‌వాలా ఒక ఇంటర్య్వూలో స్పందించాడు. 'భారత జట్టుకు ఎంపికపట్ల ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది. జాతీయ జట్టుకు నేను సెలెక్ట్‌ అయ్యానంటే నమ్మలేకపోతున్నా. ఇంగ్లండ్‌ పరిస్థితులకు నా బౌలింగ్‌ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నా. ఇక ఎప్పుడెప్పుడు ఇంగ్లండ్‌ వెళ్దామా అని ఎదురుచూస్తున్నా. అయితే ఇప్పటివరకు నేను టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని దూరం నుంచి చూశానే తప్ప ఒక్కసారి కూడా కలిసే అవకాశం రాలేదు. ఇంగ్లండ్‌ పర్యటనతో నాకు కోహ్లీని కలిసే అవకాశం కలిగింది' అని అర్జాన్‌ అన్నాడు.

అప్పుడే నా జీవితాన్ని క్రికెట్‌కు అంకితం చేశా

అప్పుడే నా జీవితాన్ని క్రికెట్‌కు అంకితం చేశా

'నా ఐపీఎల్‌ టీం కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు నా ఐకాన్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ను కలవడానికి కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నా. ఇక 2011 ప్రపంచకప్‌ నన్ను క్రికెట్‌ వైపు మళ్లించేలా చేసింది. ఎంఎస్ ధోనీ సారధ్యంలో కప్‌ను గెలవడం.. అది భారత్‌లో 28 ఏళ్ల తర్వాత సాధించడం అద్భుతం. అప్పుడే నా జీవితాన్ని క్రికెట్‌కే అంకితం చేయాలని నిర్ణయం తీసుకున్నా. అప్పటి నుంచి ప్రతి నిమిషం కటపడుతున్నా' అని అర్జాన్‌ నాగ్వాస్‌వాలా తెలిపాడు. ఇంగ్లండ్ జట్టులో ఎడమచేతి వాటంతో బంతిని స్వింగ్‌ చేసే బౌలర్లు ఎక్కువగా ఉండటంతో బీసీసీఐ సెలక్టర్లు అర్జాన్‌ను స్టాండ్‌బైగా ప్రకటించారు. అక్కడి పరిస్థితులకు భారత బ్యాట్స్‌మెన్‌ అలవాటు పడేందుకు అతడి బౌలింగ్‌ ఎంతగానో ఉపయోగపడనుంది.

నేను సాయం చేస్తున్నా.. మీరు కూడా నాతో కలిస్తే ఎందరినో కాపాడొచ్చు: పంత్

వికెట్ల వరద

వికెట్ల వరద

రంజీల్లో బరోడాపై అరంగేట్రం చేసిన నాగ్వాస్‌.. ఆ పోరులో తీసింది ఒకే ఒక్క వికెట్టు. కానీ ఆ సీజన్‌ పూర్తయ్యే సరికి 8 మ్యాచులాడి 21 వికెట్లు తీశాడు. ముంబై మ్యాచులో ఐదు వికెట్లు తీశాడు. సూర్యకుమార్‌, అర్మన్‌ జాఫర్‌, సిద్దేశ్‌ లాడ్‌, ఆదిత్య తారె వంటి సీనియర్ ఆటగాళ్లను పెవిలియన్‌ పంపి గుజరాత్‌కు 9 వికెట్ల తేడాతో విజయం అందించాడు. ఆ తర్వాతి సీజన్లో వికెట్ల వరద పారించాడు. 8 మ్యాచుల్లో 18.36 సగటుతో 41 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన విజయ్‌ హజారేలో 7 మ్యాచుల్లో 4.32 సగటుతో 19 వికెట్లు తీశాడు. ఆపై సయ్యద్‌ ముస్తాక్‌లో 5 మ్యాచుల్లో 9 వికెట్లు పడగొట్టి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.

దేశవాళీ క్రికెట్లో ఓ సంచలనం

దేశవాళీ క్రికెట్లో ఓ సంచలనం

ఈ యువ ఆటగాడి పూర్తి పేరు అర్జాన్‌ రోహింగ్టన్‌ నాగ్వాస్‌వాలా. 1997, అక్టోబర్‌17న జన్మించాడు. గుజరాత్‌ సరిహద్దు పట్టణమైన అంబర్‌గావ్‌ సమీపంలోని నర్గల్‌ అతడి స్వస్థలం. ఎడమచేతి వాటంతో బౌలింగ్‌ చేసే అతడు కుడిచేత్తో బ్యాటింగ్ చేస్తాడు. గుజరాత్‌ తరఫున అండర్‌-16, అండర్‌-19 ఆడాడు. గుజరాత్‌ దేశవాళీ క్రికెట్లో ఓ సంచలనం. 16 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 22.53 సగటు, 3.02 ఎకానమీతో 62 వికెట్లు తీశాడు. 20 లిస్ట్‌-ఏ మ్యాచుల్లో 21.76 సగటుతో 39, 15 టీ20ల్లో 16.38 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, May 8, 2021, 19:41 [IST]
Other articles published on May 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X