
హేమకుంత ఫౌండేషన్ ద్వారా:
కరోనా రోగుల కోసం అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, అవసరమైన మందులు హేమకుంత ఫౌండేషన్ ద్వారా అందించనున్నట్లు రిషబ్ పంత్ పేర్కొన్నాడు. అంతేగాక గ్రామీణ ప్రాంతాలతో పాటు నాన్ మెట్రో నగరాల్లో మెడికల్ సపోర్ట్ అందించనున్న ఆర్గనైజేషన్‌లకు తనకు తోచిన సాయం అందించనున్నట్లు పంత్ వివరించాడు. అందరూ తలోచేయి వేస్తే దేశ ప్రజల ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్‌లో షేర్ చేస్తూ ఒక సుధీర్ఘ లేఖను పంత్ రాసుకొచ్చాడు.
వారు మనకేం కాకపోవచ్చు:
'హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన దేశం కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా బాధితులకు అండగా నిలబడాల్సి ఉంది. దేశంలో కరోనాతో వేలమంది చనిపోతున్నారు. వారు మనకేం కాకపోవచ్చు. మన బంధువులు, స్నేహితులు అయితే వెంటనే స్పందించే వాళ్లం. కానీ ఒక భారతీయుడిగా మన సహచరులను కోల్పోతున్నవారి కుటుంబాలకు అండగా నిలబడాల్సిన సమయం ఇది. నా వంతుగా హేమకుంత ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్స్, మందులు అందించడానికి ప్రయత్నిస్తున్నా. వాటితో కనీసం కొంతమంది ప్రాణాలైనా కాపాడొచ్చు' అని పంత్ పేర్కొన్నాడు.

మీరు కూడా నాతో కలిస్తే:
'మీరు కూడా నాతో కలిసి వస్తే ఇంకా ఎందరి ప్రాణాలనో కాపాడొచ్చు. రండి అందరు ముందుకు రండి.. తోచినంత సాయం చేయండి. చివరిగా ఒకటి చెపుతున్నా.. కరోనా రూల్స్‌ను పాటిస్తూ అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళితే మాస్కులు ధరించండి. చేతులను నిత్యం శానిటైజ్ చేసుకోండి. వీలైతే తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రయత్నించండి' అని రిషబ్ పంత్ ట్వీట్ చేశాడు. కరోనా కేసులు పెరగడంతో ఐపీఎల్ 2021ని బీసీసీఐ నిరవధిక వాయిదా వేయడంతో.. పంత్ ఢిల్లీలోని తన ఇంటికి వెళ్లిపోయాడు.
IPL 2021: 'సంగక్కర గొంతు దగ్గర అడ్డంగా చేయి పెట్టగానే.. మా పనైపోయిందని అర్థమైంది'

భీకరమైన ఫామ్‌లో పంత్:
ఐపీఎల్ 14వ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయాస్ అయ్యర్ స్థానంలో నాయకత్వం వహించిన రిషబ్ పంత్ జట్టును అద్భుతంగా నడిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో నిలిచింది. ఇక జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా జట్టులో పంత్ చోటు దక్కించుకున్నాడు. ఆసీస్‌తో సిరీస్ నుంచి భీకరమైన ఫామ్‌లో ఉన్న పంత్.. చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే కంటిన్యూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications
