న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli: టెస్ట్ క్రికెట్‌లో కింగ్ ఆగమనానికి 10 ఏళ్లు.. రికార్డులివే!

WTC Final: Virat Kohli completes 10 years in Test Cricket
Virat Kohli Completes 10 Years Of Test Cricket - Records | 2011 To WTC Final || Oneindia Telugu

హైదరాబాద్: సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అంతా ఒకవైపు.. విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఒక వైపు.. కొన్నెళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే 'మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లీ ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్‌ అనేంతా.. ఒకప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా.. తనదైన ఆటతో, కెప్టెన్సీతో ఆటలో మైలురాళ్లను అధిగమిస్తూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వరల్డ్​ టెస్టు చాంపియన్​షిప్​ ఫైనల్​లో ఆడుతున్న విరాట్.. ఆదివారానికి(జూన్ 20) పదేళ్ల టెస్టు కెరీర్​ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా టెస్టుల్లో విరాట్​ నెలకొల్పిన అరుదైన ఘనతలను తెలుసుకుందాం.!

విండీస్‌పై అరంగేట్రం..

విండీస్‌పై అరంగేట్రం..

2011 జూన్ 20న వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​తో టెస్టు అరంగేట్రం చేసిన కోహ్లీ.. ఆ తర్వాత కాలంలో ప్లేయర్​గా, కెప్టెన్​గా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించాడు. ఈ ఫార్మాట్​లో ఎక్కువ పరుగులు చేసిన భారత్​ ఆరో బ్యాట్స్​మన్​గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన అరంగేట్రం సిరీస్​లో వెస్టిండీస్​తో నాలుగో టెస్టులో, నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు దిగి వరుసగా రెండు అర్ధసెంచరీలు చేశాడు. తర్వాత ఆస్ట్రేలియాపై తన తొలి సెంచరీ చేశాడు. ఇది విరాట్​కు ఎనిమిదో టెస్టు. ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓడిపోయినప్పటికీ, విరాట్​ బ్యాటింగ్​పై ప్రశంసలు వచ్చాయి.

ఆరో బ్యాట్స్‌మన్‌గా..

ఆరో బ్యాట్స్‌మన్‌గా..

7500కు పైగా పరుగులు చేసిన విరాట్.. ఈ ఫార్మాట్​లో ఎక్కువ రన్స్​ కొట్టిన భారత్​ బ్యాట్స్​మెన్​లో 6వ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. కెప్టెన్​గానూ 5,392 పరుగులు చేశాడు. 58 సగటుతో 20 సెంచరీలు ఇందులో ఉన్నాయి. టెస్టుల్లో అత్యధికంగా శతకాలు కొట్టిన వారిలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. సచిన్(51), రాహుల్ ద్రవిడ్(36) సునీల్ గవాస్కర్(34).. విరాట్ కంటే ముందున్నారు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్​లో 7 డబుల్ సెంచరీలు బాదిన విరాట్.. ఈ జాబితాలో టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్ తరఫున అగ్రస్థానంలో ఉన్నాడు.

 అత్యధిక రన్స్..

అత్యధిక రన్స్..

ఓ క్యాలెండర్ ఏడాదిలో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. 2016లో 1215, 2018లో 1322 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్​లో కోహ్లీ అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్. 60 మ్యాచ్​ల్లో 34 మ్యాచ్​ల్లో గెలిచి, 59.01 విజయాల శాతంతో కొనసాగుతున్నాడు. ఇతడి కంటే ముందు రికీ పాంటింగ్(62.33) మాత్రమే ఉన్నాడు. ఎక్కువగా టాస్​ ఓడిపోయే కోహ్లీ.. సౌతాఫ్రికా(2016-17, 2019-20), శ్రీలంక(2017), న్యూజిలాండ్(2016-17) టెస్టు సిరీస్​ల్లో మాత్రం అన్నింటిలో టాస్ గెలవడం విశేషం.

ఐసీసీ టీ20 ప్రపంచకప్, టెస్టు ఛాంపియన్​షిప్, వరల్డ్​కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్​లో ఆడిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ.

హాఫ్ సెంచరీకి చేరువలో..

హాఫ్ సెంచరీకి చేరువలో..

న్యూజిలాండ్‌‌తో జరుగుతున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిన పిచ్‌కు కింగ్‌లా స్వింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసి సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (124 బంతుల్లో 1 ఫోర్‌తో 44 బ్యాటింగ్‌), అజింక్యా రహానే (79 బంతుల్లో 4 ఫోర్లతో 29 బ్యాటింగ్‌) ఉన్నారు. చతేశ్వర్ పుజారా(8) విఫలమైనా.. రోహిత్‌ (34), గిల్‌ (28) ఆకట్టుకున్నారు.

Story first published: Sunday, June 20, 2021, 14:01 [IST]
Other articles published on Jun 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X