న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC ఫైనల్లో భారత బౌలర్ల వైఫల్యానికి అదే కారణం: కివీస్ మాజీ పేసర్

WTC Final: Simon Doull says Lack of match practice hurting Indian fast bowlers

సౌతాంప్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియా బౌలర్ల వైఫల్యానికి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమే కారణమని కివీస్ మాజీ పేసర్ సైమన్ డౌల్ అన్నాడు. మెగా ఫైనల్‌కు ముందు కావాల్సినంత ప్రాక్టీస్ లేకపోవడంతో భారత బౌలర్లు ఇబ్బంది పడ్డారని తెలిపాడు. ఈ మెగా ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడగా వారికి తగినంత ప్రాక్టీస్‌ లభించింది. మరోవైపు టీమిండియాకు సరైన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు లేకపోవడంతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఈ నేపథ్యంలోనే ఫైనల్‌ మ్యాచ్‌లో కివీస్‌ పేసర్లు చెలరేగినట్లుగా భారత పేసర్లు రాణించలేకపోయారని సైమన్‌డౌల్‌ క్రిక్ బజ్‌ షోలో తెలిపాడు.

 మ్యాచ్ ప్రాక్టీస్ లేకనే..

మ్యాచ్ ప్రాక్టీస్ లేకనే..

ప్రముఖ కామెంటేటర్ హర్షభోగ్లే‌తో కలిసి మూడో రోజు ఆటను విశ్లేషించిన సైమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'కొన్నిసార్లు మీరు అతిగా ఊహించుకొని.. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు సరైన సన్నద్ధత లభించిందా? అని అడగొచ్చు. అయితే, కోహ్లీసేనకు తగినంత సమయం దొరికిందని నేను కచ్చితంగా చెప్పగలను. గత 10-12 రోజుల్లో భారత పేసర్లు వీలైనంత ఎక్కువసేపు బౌలింగ్‌ చేసి తుది సమరానికి సిద్ధమై ఉండొచ్చు. కానీ, మ్యాచ్‌ ప్రాక్టీస్‌తో సమానంగా వారి సన్నద్ధతని పోల్చడం చాలా కష్టం. ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ల్లో బౌలింగ్ ప్రాక్టీస్‌ చేయడం ప్రయత్నించొచ్చు. కానీ ఆ సన్నద్ధత పనికిరాదు. దాన్ని మ్యాచ్‌ ప్రాక్టీస్‌తో పోల్చిచూడటం నిజంగా కష్టతరమే' అని డౌల్‌ తెలిపాడు.

 నిఖార్సైన స్వింగ్ బౌలర్..

నిఖార్సైన స్వింగ్ బౌలర్..

మెగా ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో తలపడటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చిందని మాజీ పేసర్‌ పేర్కొన్నాడు. 'కివీస్‌ కూడా భారత్‌లాగే ఇంగ్లిష్‌ జట్టుతో టెస్టు సిరీస్‌ ఆడేముందు పది రోజులు ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌లు ఆడి బాగా సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో ఆడేసరికి న్యూజిలాండ్‌ క్రికెటర్లు అన్ని విధాలా మెరుగయ్యారు. ఇక ఫైనల్లో టీమిండియా పేసర్లలో ఇషాంత్‌ మినహా మిగతావారిలో నిఖార్సైన స్వింగ్‌ బౌలర్‌ లేరు. బుమ్రా స్వింగ్‌ చేయగలడు. కానీ ఇషాంత్‌ మరింత ఎక్కువ స్వింగ్‌ రాబడతాడు. మహ్మద్ షమీ సైతం స్వింగ్‌ బౌలర్‌ కాదు. అతను ఓ సీమర్ మాత్రమే. షమీ, బుమ్రా చాలా అరుదుగా స్వింగ్‌ చేస్తారు'అని సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు.

 చెలరేగిన జెమీసన్..

చెలరేగిన జెమీసన్..

న్యూజిలాండ్‌ పేస్‌ పదునుకు భారత్‌ తడబడింది. కలిసొచ్చిన పిచ్‌పై న్యూజిలాండ్‌ సీమర్‌ కైల్‌ జేమీసన్‌ (5/31) నిప్పులు చెరగడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది. రహానే (190 బంతుల్లో 49; 5 ఫోర్లు), కోహ్లి (196 బంతుల్లో 44; 1 ఫోర్‌) రాణించారు. బౌల్ట్, వాగ్నర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్‌ (12 బ్యాటింగ్‌), రాస్‌ టేలర్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అశ్విన్, ఇషాంత్‌కు చెరో వికెట్‌ దక్కింది.

Story first published: Monday, June 21, 2021, 22:47 [IST]
Other articles published on Jun 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X