న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని ఉన్నంత వరకూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌నే: దినేశ్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు

ICC Cricket World Cup 2019 : Dinesh Karthik Believes He Is Like A First-Aid Kit In The Squad
World Cup 2019: With Dhoni in team, Im just a small first-aid kit, says Dinesh Karthik

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికైన దినేశ్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాకప్ వికెట్ కీపర్ విషయంలో గత కొంతకాలంగా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే, చివరకు సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌వైపే మొగ్గు చూపిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఒత్తిడిని ఎదుర్కొనడంలో

ఒత్తిడిని ఎదుర్కొనడంలో

ఒత్తిడిని ఎదుర్కొనడంలో దినేశ్ కార్తీక్ దిట్ట అని ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. వరల్డ్ కప్‌లో భారత వికెట్ కీపర్‌గా ధోనినే వికెట్ కీపింగ్ చేస్తాడని... ఒక‌వేళ ధోని గాయం కారణంగా మ్యాచ్‌లకు దూరమైతే అప్పుడు వికెట్ కీపింగ్ బాధ్య‌త‌ల‌ను దినేశ్ కార్తీక్ నిర్వ‌ర్తిస్తాడని తెలిపాడు. వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కడంపై దినేశ్ కార్తీక్ స్పందించాడు.

ధోని జట్టులో ఉన్నంత వరకూ

ధోని జట్టులో ఉన్నంత వరకూ

"చూడండి, ధోని జట్టులో ఉన్నంత వరకూ.... చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ మాదిరి జట్టుతో కలిసి ప్రయాణం చేస్తూ ఉండటమే నా పని. ధోనికి గాయమైతే ఆ రోజుకు నేను బ్యాండ్ ఎయిడ్‌గా పనికొస్తాను" అని దినేశ్ కార్తీక్ సంచనల వ్యాఖ్యలు చేశాడు. అయితే, తాను ఫినిషర్‌గా No. 4 స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు కూడా అర్హుడినేనని, ఆ అర్హతతోనైనా తనకు మరిన్ని అవకాశాలు దక్కుతాయని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. ఐపీఎల్ తర్వాత... ప్రతిరోజూ మంచి ప్రదర్శన చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని... అంతకముందు కూడా బ్యాట్స్‌మెన్‌గా రాణించాను" అని దినేశ్ కార్తీక్ తెలిపాడు.

కల సాకారమైంది

వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో చోటు దక్కించుకోవడంతో తన కల సాకారమైందని దినేశ్ కార్తీక్ అన్నాడు. "వరల్డ్‌కప్‌కు ఎంపిక అవడం చాలా సంతోషంగా ఉంది. సుదీర్ఘకాలం తర్వాత ఈ జట్టులో భాగస్వామిని అయినందుకు నా కల సాకారమైంది" అని దినేశ్‌ కార్తీక్‌ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోని కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌ జట్టు తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

దినేశ్‌ కార్తీక్‌కు ఇది రెండో వరల్డ్‌కప్

దినేశ్‌ కార్తీక్‌కు ఇది రెండో వరల్డ్‌కప్

33 ఏళ్ల దినేశ్‌ కార్తీక్‌కు ఇది రెండో వరల్డ్‌కప్ కావడం విశేషం. 2007లో దినేశ్‌ కార్తీక్‌ తన మొట్టమొదటి వరల్డ్‌కప్‌ను ఆడాడు. ఆ తర్వాత మళ్లీ 12 ఏళ్లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మే30 నుంచి ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోంది. జులై 14న లార్డ్స్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Story first published: Wednesday, April 17, 2019, 15:30 [IST]
Other articles published on Apr 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X