న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌ ప్రత్యర్థి ఎవరు?

World Cup 2019: What happens to Pakistan if England beat New Zealand?

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సమిష్టి ప్రదర్శనతో టైటిల్ వేటలో మరో ముందడుగు వేసింది. బర్మింగ్ హామ్ వేదికగా మంగళవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా నిలిచింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

పూర్తిగా ఏకపక్షంగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అద్భుతంగా పోరాడింది. ఒకానొక దశలో విజయం సాధిస్తుందని కూడా అనుకున్నారంతా. అయితే టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బంగ్లా ఓటమిపాలైంది. టీమిండియా నిర్దేశించిన 315 పరుగుల లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 286 పరుగులకే కుప్పకూలింది.

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ సెంచరీ

ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ విజయంతో టీమిండియా 13 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ మెగా టోర్నీలో టీమిండియాకు ఇంకో మ్యాచ్ మిగులుంది. ఈ ప్రపంచకప్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న నేపథ్యంలో పాయింట్ల పట్టికలో 1, 4 స్థానాల్లో ఉన్న జట్లు తొలి సెమీస్‌ ఆడగా.. 2, 3 స్థానాల్లో ఉన్న జట్లు రెండో సెమీస్‌ ఆడతాయి.

టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరు?

టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరు?

ఈ నేపథ్యంలో టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరన్నదే తేలాల్సి ఉంది. 14 పాయింట్లతో పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. జులై 6న ఆసీస్ తన చివరి మ్యాచ్‌ని దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధిస్తే 16 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది.

శ్రీలంకపై టీమిండియా గెలిస్తే

శ్రీలంకపై టీమిండియా గెలిస్తే

మరోవైపు టీమిండియా కూడా అదే రోజున శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే 15 పాయింట్లతో రెండో స్థానంలోనే ఉంటుంది. దీంతో ఒకటి, రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, టీమిండియాకు ఫిక్స్ అయ్యాయి. బుధవారం టోర్నీలో భాగంగా న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

సెమీస్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడవు

సెమీస్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడవు

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌ విజయం సాధిస్తే మూడో స్థానంలో నిలిచి సెమీస్‌లో టీమిండియాతో తలపడనుంది. అలా కాకుండా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే టీమిండియా ప్రత్యర్ధి న్యూజిలాండ్ అవుతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్‌ ఓడి, శ్రీలంకను ఓడించి భారత్‌ అగ్రస్థానానికి చేరితే.. న్యూజిలాండ్‌ లేదా ఇంగ్లాండ్‌ లేదా పాకిస్థాన్‌‌లతో టీమిండియా తలపడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ ప్రపంచకప్ సెమీస్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడవు.

Story first published: Wednesday, July 3, 2019, 13:42 [IST]
Other articles published on Jul 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X