న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విజ్డన్ లీడింగ్ క్రికెటర్‌గా వరల్డ్ కప్ హీరో.. భారత క్రికెటర్స్‌కు నో చాన్స్

World Cup 2019 heroics help Ben Stokes unseat Virat Kohli as Wisdens leading cricketer in the world

లండన్: వరుసగా మూడేళ్లు విజ్డన్ రారాజుగా నిలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ సారి మాత్రం నిరాశే ఎదురైంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ పెర్ఫామెన్స్‌తో తన జట్టును విశ్వవిజేతగా నిలిపిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

2020 విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఫలితంగా 2005లో ఇంగ్లండ్ తరఫున తొలిసారి ఈ ఘనతను అందుకున్న మాజీ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న రెండో ఇంగ్లీష్ ప్లేయర్‌గా నిలిచాడు.

న్యూజిలాండ్‌తో ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన వరల్డ్ కప్ ఫైనల్లో స్టోక్స్ 84 పరుగులతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో మ్యాచ్ టై అయి.. సూపర్ ఓవర్‌కు దారితీయగా.. స్టోక్స్-బట్లర్ జోడీ 15 పరుగులు చేసింది. అనంతరం కివీస్ కూడా 15 పరుగులే చేయడంతో బౌండరీల లెక్కన కివీస్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ మెగాటోర్నీ తర్వాత జరిగిన యాషెస్ సిరీస్‌లో కూడా స్టోక్స్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. హెడింగ్లీ టెస్ట్ మ్యాచ్‌లో ఆఖరి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యంతో అతను చేసిన పోరాటం అద్భుతం.

వారాల వ్యవధిలోనే స్టోక్స్ తన జీవితాంతం గుర్తుండిపోయే అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చాడని విజ్డన్ ఎడిటర్ లారెన్స్ బూత్ తెలిపాడు. ముఖ్యంగా ప్రపంచకప్ ఫైనల్, యాషెస్ సిరీస్‌లో అతను అసాధారణంగా ఆడాడని చెప్పుకొచ్చాడు. ఇక మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ విజ్డన్ లీడింగ్ మహిళా క్రికెటర్‌గా నిలిచింది.

విజ్డన్ అత్యత్తుమ ఐదుగురు ప్లేయర్ల జాబితాలో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్, ఎల్లిస్ పెర్రీ, సిమన్ హర్మర్, మార్నస్ లబుషేన్ చోటు దక్కించుకున్నారు. విజ్డన్ టీ20 లీడింగ్ క్రికెటర్‌గా వెస్డిండీస్ విధ్వంసకర ప్లేయర్ ఆండ్రూ రసెల్ ఎంపికయ్యాడు. హెడింగ్లీలోని బెన్ స్టోక్స్ ఫోజ్.. విజ్డన్ ఫొటోగ్రాఫ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది.

Story first published: Wednesday, April 8, 2020, 16:56 [IST]
Other articles published on Apr 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X