న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సఫారీలతో తొలి మ్యాచ్: భారత బౌలింగ్ ఎటాక్‌పై సచిన్ ప్రశంస

World Cup 2019: Current Indian bowling attack is most complete of this era, believes Sachin Tendulkar

హైదరాబాద్: టీమిండియా బౌలర్లపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత బౌలింగ్ దళం సంపూర్తిగా ఉందని తెలిపాడు. ముఖ్యంగా ప్రస్తుతం భారత జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్నారని సచిన్ టెండూల్కర్ కొనియాడాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఐసీసీ వరల్డ్‌కప్ మెగా టోర్నీలో భాగంగా బుధవారం కోహ్లీసేన తన ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో సచిన్ మాట్లాడుతూ ప్రస్తుత టీమిండియా బౌలర్లను ఒకప్పటి బౌలర్లతో పోల్చడం సరికాదని చెప్పుకొచ్చాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉందని, నిబంధనల్లోనూ ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపాడు.

"మేం ఆడే రోజుల్లో రెండు కొత్త బంతులు.. ఫీల్డింగ్‌లో నిబంధనలు(11 నుంచి 40 ఓవర్ల మధ్యలో నలుగురు ఫీల్డిర్లు 30 యాడ్ సర్కిల్ బయట ఉండటం.. ఇక, చివరి 10 ఓవర్లలో మరోకరు అదనం). 100 మీటర్లు పరిగెత్తే ఆటగాళ్లు నిబంధనల్లో మార్పులు రావడంతో ఇప్పుడు 90మీ లేదా 80 మీ మాత్రమే పరిగెత్తేలాగా" అని సచిన్ పేర్కొన్నాడు.

వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ: మొత్తం టోర్నీకి డేల్ స్టెయిన్ దూరంవరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ: మొత్తం టోర్నీకి డేల్ స్టెయిన్ దూరం

కాగా, ప్రస్తుత జట్టులో బుమ్రాలాంటి ప్రపంచశ్రేణి ఆటగాడు ఉండడం టీమిండియాకు ఎంతగానో లాభిస్తోందని సచిన్ అన్నాడు. కుల్దీప్, చాహల్‌లు మిడిల్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ కట్టడి చేయడంతో పాటు మణికట్టు స్పిన్‌తో మాయ చేసి ఎక్కువ వికెట్లు తీయగలుగుతారని సచిన్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, June 4, 2019, 19:04 [IST]
Other articles published on Jun 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X