న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మంచి ఆలోచన: No.4లో కోహ్లీ, శాస్త్రికే ఓటేసిన ఎమ్మెస్కే ప్రసాద్

Wonderful thought: Chief selector MSK Prasad agrees with coach Ravi Shastris idea to play Virat Kohli at No.4

హైదరాబాద్: టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను మరింత బలోపేతం చేసేందుకు గాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని ఆలోచిస్తున్నట్లు కోచ్ రవిశాస్త్రి ఇటీవల ఓ ఇంటర్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇది తెలివి తక్కువ నిర్ణయమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మండిపడగా... రవిశాస్త్రి నిర్ణయానికి మారో మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం మద్దతుగా నిలిచాడు. తాజాగా కోహ్లీని నాలుగో స్థానంలో ఆడించాలనే వారి జాబితాలో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా చేరాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలతో ఎమ్మెస్కే ప్రసాద్ ఏకీభవించాడు.

<strong>ఆసీస్ పర్యటనలో వార్న్ సలహాల వల్లే!: కుల్దీప్ యాదవ్</strong>ఆసీస్ పర్యటనలో వార్న్ సలహాల వల్లే!: కుల్దీప్ యాదవ్

ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ

ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ

సోమవారం హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "నా అభిప్రాయం వరకు ఇది చాలా మంచి ఆలోచన. కోహ్లి నంబర్ 4లోనూ బ్యాటింగ్ చేయగలడు. కొన్ని రోజులుగా ఇదే జరుగుతున్నది. కానీ మరోసారి దీనిపై ఆలోచించాలి. టోర్నీ మొత్తం కాదు.. కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే ఈ ప్రయోగం చేస్తాం" అని అన్నాడు.

నంబర్ 3లో కోహ్లి అద్భుతంగా రాణించాడు

నంబర్ 3లో కోహ్లి అద్భుతంగా రాణించాడు

"ఎందుకంటే? నంబర్ 3లో కోహ్లి అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం అతను వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్. అయితే టీమ్‌కు అవసరమైతే కోహ్లి నంబర్ 4లోనూ బ్యాటింగ్ చేయగలడు. టీమ్ అవసరలేంటో చూడాలి. ఆ తర్వాతే అతని బ్యాటింగ్ స్థానంపై తుది నిర్ణయం తీసుకుంటాం" అని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు.

మూడో స్థానంలో దిగి 32 సెంచరీలు బాదిన కోహ్లీ

మూడో స్థానంలో దిగి 32 సెంచరీలు బాదిన కోహ్లీ

కాగా, వన్డేల్లో సుదీర్ఘకాలంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకూ 59.50 సగటుతో 10,533 పరుగులు చేశాడు. అతని కెరీర్‌లో మొత్తం 39 సెంచరీలు ఉండగా.. అందులో ఏకంగా 32 సెంచరీలు నెం.3లో ఆడి చేసినవే కావడం విశేషం. ఇక, నంబర్ 4లోనూ రికార్డు బాగానే ఉంది. 23 ఇన్నింగ్స్‌లో 58 సగటుతో 1744 పరుగులు చేశాడు.

Story first published: Monday, February 18, 2019, 17:46 [IST]
Other articles published on Feb 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X