న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Women's T20 Challenge: ఆడోళ్ల ఆట షురూ.. హర్మన్‌సేనదే బ్యాటింగ్!

Womens T20 Challenge: Harmanpreet Kaur wins toss and choose to bat

పుణే: ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశ సక్సెస్‌ఫుల్‌గా ముగియడంతో మహిళల టీ20 ఛాలెంజ్ 2022 మొదలైంది. గతేడాదిలానే మూడు జట్లతో ఈ టోర్నీ అభిమానులను అలరించనుంది. ఈ టోర్నీలో భాగంగా పుణే వేదికగా ట్రైల్ బ్రేజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్‌నోవాస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో స్వేచ్చగా బ్యాటింగ్ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. భారత, విదేశీ ఆటగాళ్లతో తమకు మంచి లైనప్ ఉందని, సన్నాహకం కూడా అద్భుతంగా జరిగిందని చెప్పుకొచ్చింది. తమ ప్రణాళికలను అమలు చేయడమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొంది.

ఇక తాను టాస్ గెలిచినా ఫీల్డింగ్ తీసుకేదానినని ట్రైల్ బ్లేజర్స్ స్మృతి మంధాన తెలిపింది. కాబట్టి టాస్ ఓడినందుకు బాధగా లేదని, మూడు మ్యాచ్‌లే ఉండటంతో బెస్ట్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పింది. అయితే ఇరు జట్లలో కూడా చాలా మంది స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ పూణేలో ఎంసీఎ క్రికెట్‌ స్టేడియం వేదికగానే జరగనున్నాయి. ఇక ఫైనల్‌ మే 28న జరగనుంది.

తుది జట్లు (అంచనా)
ట్రైల్‌బ్లేజర్స్‌
స్మృతి మంధాన (కెప్టెన్‌), పూనమ్ యాదవ్, హేలీ మాథ్యూస్, జెమిమా రోడ్రిగ్స్, సోఫియా డంక్లీ, రాజేశ్వరి గైక్వాడ్‌, అరుంధతి రెడ్డి, , సల్మా ఖాతున్
షర్మిన్ అక్తర్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌)

సూపర్‌నోవాస్‌
డియాండ్రా డోటిన్, ప్రియా పునియా, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), సునే లూస్, హర్లీన్ డియోల్, తానియా భాటియా (వికెట్‌ కీపర్‌), పూజా వస్త్రాకర్, సోఫీ ఎక్లెస్టోన్, అలనా కింగ్, వి చందు, మేఘనా సింగ్

Story first published: Monday, May 23, 2022, 19:29 [IST]
Other articles published on May 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X