న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాదేశ్‌ను దగ్గరుండి గెలిపించింది భారత మహిళే..

 Womens Asia Cup: The Indian hand in Bangladesh success

హైదరాబాద్: ఆసియాకప్‌ మహిళల టీ20 టోర్నీలో భారత్ విజయాల పరంపరకు బంగ్లాదేశ్‌ చెక్ పెట్టింది. అనూహ్య రీతిలో భారత్‌ను ఓడించిన బంగ్లా టైటిల్ గెలుచుకుంది. ఈ విజయం వెనుక మరో భారత మహిళా క్రికెటర్‌ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత మాజీ క్రికెటర్‌ అంజూ జైన్‌ బంగ్లాకోచ్‌గా ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. గత నెల దక్షిణాఫ్రికాలో పర్యటించిన బంగ్లాదేశ్‌ దారుణ ఓటములను మూటగట్టుకుంది.

 పరాజయాలను తీవ్రంగా పరిగణించి

పరాజయాలను తీవ్రంగా పరిగణించి

వన్డే (5-0), టీ20 (3-0)లతో క్లీన్‌స్వీప్‌ అయి వెనుదిరిగింది. ఈ పరాజయాలను తీవ్రంగా పరిగణించిన ఆ దేశ బోర్డు వెంటనే కోచ్‌ను మార్చేసింది. అప్పటి కోచ్‌ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ కాపెల్‌ను తొలిగించి భారత మాజీ వికెట్‌ కీపర్‌ అంజూ జైన్‌ నియమించింది. ఈ పరిస్థితిల్లో బంగ్లా ఆసియాకప్‌లో రాణిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ అంజూ జైన్‌ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా టైటిల్‌ గెలిచేలా చేశారు.

తక్కువ సమయంలోనే బంగ్లాదేశ్‌ కోచ్‌గా

తక్కువ సమయంలోనే బంగ్లాదేశ్‌ కోచ్‌గా

ఈ విజయానంతరం ఆమె మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలోనే బంగ్లాదేశ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాను. దీన్ని ఓ పెద్ద సవాల్‌గా స్వీకరించాను. ఆ సమయంలో బంగ్లా జట్టు చాలా దారుణ స్థితిలో ఉంది. కేవలం వారిలో ఉత్సహాన్ని నింపే ప్రయత్నం చేశాను. ఈ విజయం జట్టుకు, వ్యక్తిగతంగా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం జట్టులోని బలహీనతలను గుర్తించాను. దానికి అనుగుణంగా ప్రణాళికలను అమలు చేశాను. ఫైనల్‌ గెలవడంలో ఎలాంటి మంత్రం లేదు. ప్రతి మ్యాచ్‌లో ప్రణాళికలను విజయవంతంగా అమలు చేశాం. ఎవరూ కూడా భారత్‌తో లక్కీగా గెలిచారని అనొద్దు అని ఈ మ్యాచ్‌కు మందు ప్రతి క్రికెటర్‌కు చెప్పా.. అని ఈ భారత మాజీ క్రికెటర్‌ తెలిపారు.

భారత్‌ను రెండుసార్లు చిత్తుగా ఓడించి:

భారత్‌ను రెండుసార్లు చిత్తుగా ఓడించి:

ఆరుసార్లు చాంపియన్‌, టోర్నీలో బంగ్లాపై ఓటమి చెందడంతో భారత్‌ ఒత్తిడికి లోనైందన్నారు. తమ జట్టుకు ఇది తొలి ఫైనల్‌ అయినప్పటికీ తమ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా రాణించారని తెలిపారు.

నెల రోజుల క్రితం కోచ్‌గా బాధ్యతలు మాజీ వికెట్‌కీపర్, బ్యాట్స్ ‌ఉమెన్ తన కోచింగ్‌తో బంగ్లాదేశ్ జట్టు భారత్‌ను ఈ సీజన్‌లో రెండుసార్లు చిత్తుగా ఓడించింది. ‘ఆసియా మహిళల్లో బంగ్లాదేశ్ జట్టు మొదటి స్థానంలో ఉండటం చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన ఫాంలో ఉన్న టీం ఇండియా ప్లేయర్లు మిథాలీ రాజ్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లను ఎదుర్కొనేందుకు ఎన్నో వ్యూహాలు రచించాం. మా తర్వాతి లక్ష్యం వెస్టిండీస్ వేదికగా జరిగే టీ-20 వరల్డ్ కప్‌కి అర్హత సాధించడమే' అని అన్నారు.

మరో ఇద్దరు భారతీయ మహిళలు

మరో ఇద్దరు భారతీయ మహిళలు

ఈ సిరీస్‌లో అంజూకి మరో ఇద్దరు భారతీయ మహిళలు సహాయకంగా ఉన్నారు. అసిస్టెంట్ కోచ్‌గా దేవికా పాల్‌షికర్, ఫిజియోథెరిపిస్ట్‌గా అనూజా దాల్వీ వ్యవహరించారు. కాగా బంగ్లాదేశ్‌తో కలిసి పని చేసిన రెండు ఇండియన్ క్రికెటర్‌గా అంజూ నిలిచింది. గతంలో జట్టు మాజీ కెప్టెన్ మమత మబెన్ 2011-13 వరకూ బంగ్లాదేశ్ జట్టు ఇన్‌చార్జీగా ఉంది.

Story first published: Monday, June 11, 2018, 18:47 [IST]
Other articles published on Jun 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X