న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్‌లో ఓడడానికి ఏమీ లేదు, భారత్ దూకుడు పెంచాలి: గంభీర్

By Nageshwara Rao
 With nothing to lose India should go on an all-out attack, feels Gautam Gambhir

న్యూఢిల్లీ: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీసేన మరింత దూకుడు పెంచాలని వెటరన్ గౌతమ్ గంభీర్ సూచించాడు. తొలిరోజు వర్షం కారణంగా పూర్తి ఆట రద్దు కాగా, రెండో రోజైన శుక్రవారం టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని టీమిండియాను 107 పరుగులకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే.

2018: అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ నంబర్ వన్2018: అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ నంబర్ వన్

లార్డ్స్ టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌పై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ "ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ టెస్టులో రెండో రోజు భారత్ జట్టు పేలవరీతిలో 107 పరుగులకే ఆలౌటవడం నిరాశపరిచింది. పిచ్‌ నుంచి పేస్ బౌలర్లకి సహకారం లభిస్తున్నప్పుడు జేమ్స్ అండర్సన్‌ని ఎదుర్కోవడం చాలా కష్టం. నా అంచనా ప్రకారం శనివారం కూడా పిచ్‌ అలానే ఉండొచ్చు" అని అన్నాడు.

5/20: లార్డ్స్‌లో ఆండర్సన్ నెలకొల్పిన అరుదైన రికార్డులివే5/20: లార్డ్స్‌లో ఆండర్సన్ నెలకొల్పిన అరుదైన రికార్డులివే

"భారత ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించాలి. వారితో పాటు హార్దిక్ పాండ్య బౌలింగ్‌ కూడా ఈరోజు కీలకం. ఐదు టెస్టుల సిరీస్‌‌‌లో రెండో టెస్టు ఫలితం చాలా ముఖ్యం. ఒకవేళ రెండో టెస్టు చేజార్చుకుని.. ఆ తర్వాత వరుసగా మూడు టెస్టుల్లో.. అదీ విదేశీ గడ్డపై గెలవాలంటే కష్టం" అని గంభీర్ పేర్కొన్నాడు.

1
42375

"శనివారం భారత్ జట్టు మైదానంలో దూకుడు పెంచి.. మ్యాచ్‌లో పుంజుకోవాలి. తక్కువ స్కోరుకే ఆలౌటవడంతో ఇక మ్యాచ్‌లో భారత్‌ చేజార్చుకోవడానికి ఏమీ లేదు" అని గంభీర్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు తక్కువ స్కోరుకే ఆలౌటైన నేపథ్యంలో దూకుడు పెంచి పోరాడాలని గంభీర్ సూచించాడు.

తొలి టెస్టులో ఎదురైన ఓటమికి లార్డ్స్‌లో బదులిస్తారేమో అని అభిమానులు ఆశించినా టీమిండియా ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. తొలి రోజులాగే రెండో రోజు కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రెండు సెషన్లలో కేవలం 8.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

గత పదేళ్లలో మొత్తం 13: రనౌట్లలో పుజారా అరుదైన రికార్డుగత పదేళ్లలో మొత్తం 13: రనౌట్లలో పుజారా అరుదైన రికార్డు

వర్షం దోబూచులాడిన రెండో రోజు ఆఖరి ఇన్నింగ్స్‌ మాత్రమే పూర్తిగా సాగగా ఇంగ్లండ్‌ పేసర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులతో చెలరేగారు. ముఖ్యంగా జేమ్స్‌ ఆండర్సన్‌ (5/20) ధాటికి భారత్‌ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది.

రవిచంద్రన్ అశ్విన్‌ (29) మాత్రమే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరో బౌలర్ క్రిస్ వోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Story first published: Saturday, August 11, 2018, 17:25 [IST]
Other articles published on Aug 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X