ఆరో వన్డేతో రో'హిట్'.. సచిన్ రికార్డుని బ్రేక్

Posted By: Subhan
Who will break Sachin's record of most hundreds, Virat Kohli or Rohit Sharma?

హైదరాబాద్: సఫారీ పర్యటనలో రోహిత్ శర్మ వరుస వైఫల్యాలను ఎదుర్కొన్నాడు. ఎట్టకేలకు అదే జట్టుతో పోరాడి సెంచరీని సంపాదించాడు. మంగళవారం జరిగిన ఐదో వన్డేలో రోహిత్ శర్మ చేసిన పరుగులు బౌండరీలకు అతని పేరిట మరో రికార్డు నమోదైంది.

గత ఏడాది 65 సిక్స్‌లు బాదిన రోహిత్ శర్మ.. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు సంధించిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. సఫారీ గడ్డ మీద వరుస మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ.. రోహత్ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. ఒకే సీజన్ (2017-18)లో అత్యధికంగా సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా హిట్ మ్యాన్ (57) నిలిచాడు.

పోర్ట్ ఎలిజబెత్ వన్డేలో 115 పరుగులు చేసిన రోహిత్.. నాలుగు సిక్స్‌లు, 11 ఫోర్లు చేసి బంతిని బౌండరీకి పరుగులు పట్టించాడు. దీంతో భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ విషయంలో ధోనీ కంటే మాత్రం రోహిత్ వెనకే ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ 264 సిక్స్‌లు బాదగా.. రోహిత్ 265 సిక్సర్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

సఫారీ గడ్డ మీద వరుసగా రెండు టెస్టులు, నాలుగు వన్డేల్లో పేలవ ఆటతీరు కనబర్చిన రోహిత్.. ఐదో వన్డేలో సెంచరీతో భారత్‌ను గెలిపించాడు. కానీ సెంచరీ చేసిన టైంలోనూ మామూలుగా ఉండిపోయాడు. అతని కళ్ల ముందే ఇద్దరు రనౌట్ అవడంతో అతనికి బాధగా అనిపిందని తెలిపాడు. అందుకే సంబరాలు చేసుకోలేదన్నాడు.

పేలవ ప్రదర్శనకు నిదర్శనంగా రోహిత్‌ను ఐదో వన్డేకు తీసుకోకపోవచ్చనే వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ రోహిత్ సెంచరీ సమాధానంగా నిలిచింది. ఫిబ్రవరి 16న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆరో వన్డే నామమాత్రంగా జరగనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, February 14, 2018, 13:57 [IST]
Other articles published on Feb 14, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి