న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ ఫస్ట్ సెంచరీ చేసినప్పుడు.. కోహ్లీ, రోహిత్ చెడ్డీలు కూడా వేసుకోలేదు! బాబర్ అయితే పుట్టనేలేదు!

When Sachin Tendulkar scored his first ton age of virat kohli was 1y 282d

హైదరాబాద్: కరోనా దెబ్బకు ఐపీఎల్ 2021 సీజన్ అర్థాంతరంగా వాయిదా పడటంతో అంతర్జాతీయ క్రికెట్ మూగబోయింది. ఐపీఎల్ కారణంగా మరే సిరీస్‌లు కూడా షెడ్యూల్ చేయలేదు. పాకిస్థాన్-జింబాబ్వే మధ్య సిరీస్‌లు కూడా ముగిసిపోయాయి. దాంతో క్రికెట్ మ్యాచ్‌లు లేక అభిమానులు బోర్‌గా ఫీలవుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్‌కు సంబంధించిన సరదా పోస్ట్‌లను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ సంబంధించి చేసిన ఓ ఫన్నీ పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అది ఏంటంటే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తొలి సెంచరీ చేసినప్పుడు.. ఈ తరం బెస్ట్ బ్యాట్స్‌మన్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్.. ఏం చేస్తున్నారని తెలియజేస్తూ చేసిన ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. సచిన్ టెండూల్కర్ 1990 ఆగస్టు 14న ఇంగ్లండ్‌పై తొలి సెంచరీ సాధించాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టులో అద్భుతంగా రాణించిన సచిన్ సెంచరీతో పాటు ఓటమి గండం నుంచి జట్టును గటెక్కించాడు.

చెడ్డీలు వేసుకోలేదు..

అయితే ఆ సమయానికి ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండేళ్ల చిన్నారి కాగా.. రోహిత్ శర్మకు మూడేళ్లు, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అయితే 6 రోజుల పసికందు. స్టీవ్ స్మిత్ సైతం రెండేళ్లుండగా.. డేవిడ్ వార్నర్ నాలుగేళ్ల పిల్లాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్, సౌతాఫ్రికా సారథి క్వింటన్ డికాక్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ పుట్టనేలేదు. ఇయాన్ మోర్గాన్ మూడేళ్లుండగా.. ఫాఫ్ డూప్లెసిస్ 6 ఏళ్ల పిల్లోడు. వీరి వయసులను షేర్ చేస్తున్న అభిమానులు.. సచిన్ తొలి సెంచరీ చేసినప్పుడు ఈ స్టార్లంతా చెడ్డీలు కూడా వేసుకోలేదని కామెంట్ చేస్తున్నారు.

సీనియర్లు తడబడిన వేళ..

సీనియర్లు తడబడిన వేళ..

ఇంగ్లండ్‌తో నాటి మ్యాచ్‌లో దిగ్గజ క్రికెటర్లు తడబడినా.. సచిన్ టెండూల్కర్ ఇంగ్లీష్ బౌలర్లకు ఎదురు నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్‌కు 408 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. డెవాన్ మెక్‌కల్లమ్, అంగస్ ఫ్రేసర్, ఎడ్డీ హెమ్మింగ్స్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. సిద్ధు డకౌట్ కాగా.. రవిశాస్త్రి 12 పరుగులు, సంజయ్ మంజ్రేకర్ 50 రన్స్ చేసిన పెవిలియన్ చేరారు. వెంగ్‌సర్కార్ కూడా 32 పరుగులకే అవుటయ్యాడు. 109 పరుగులకే 4 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన సచిన్ అద్భుతంగా రాణించాడు.

11 పరుగులు చేసిన కెప్టెన్ అజారుద్దీన్ అవుటైనా.. కపిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు.

గవాస్కర్ ప్యాడ్లతో..

గవాస్కర్ ప్యాడ్లతో..

హెమ్మింగ్స్ రిటర్న్ క్యాచ్ వదలడంతో సచిన్‌కు లైఫ్ వచ్చింది. అది మొదలు అతడు వెనుదిరిగి చూడలేదు.. 189 బంతులను ఓపికగా ఎదుర్కొన్న సచిన్ 119 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 67 రన్స్‌తో మనోజ్ ప్రభాకర్ మాస్టర్‌కు అండగా నిలిచాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో గవాస్కర్ ఇచ్చిన పాత ప్యాడ్లను కట్టుకుని బరిలో దిగిన సచిన్.. ఇంగ్లండ్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. 17 ఏళ్ల 112 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద సెంచరీ సాధించిన పిన్న వయస్కుడు సచినే కావడం విశేషం. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు.

Story first published: Tuesday, May 11, 2021, 18:20 [IST]
Other articles published on May 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X