న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాల్యా భవంతి ఓ అద్భుతం, ‘కింగ్’లా ఫీలయ్యా: గేల్

న్యూఢిల్లీ: రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి) జట్టులో చేరిన కొంత కాలానికే వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్... బ్యాంకులకు రూ.9వేల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు చెందిన గోవాలోని బీచ్ భవనంలో ఐదు రోజులు గడిపాడు.

అంతేగాక, ఆ ఐదు రోజులపాటు గేల్‌కే ఆ భవనాన్ని కేటాయించారు మాల్యా. మూడు చక్రాల హార్లే డేవిడ్సన్ వాహనాన్ని కూడా గేల్ అప్పగించారు మాల్యా. ఈ విషయాలను గేల్ తన ఆటోబయోగ్రఫి(సిక్స్ మెషీన్: ఐ డోంట్ లైక్ క్రికెట్.. ఐ లవ్ ఇట్)లో పేర్కొన్నాడు. కాగా, ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్‌ పబ్లిష్ చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు జట్టు తరపున ఆడుతున్న సమయంలో మాల్యాకు చెందిన గోవా భవంతి గురించి టీమ్ మేనేజర్ జార్జ్ అవినాశ్ నుంచి తెలుసుకున్నాడు. రెండు మ్యాచ్‌ల మధ్య ఐదు రోజుల విరామం ఉండటంతో గేల్.. మాల్యాకు చెందిన ఆ భవంతికి ఒంటరిగానే చెక్కేశాడు.

When Chris Gayle spent 5 days in Vijay Mallya's Goa mansion!

భవంతి గురించి వినగానే తాను అక్కడి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు గేల్ తెలిపాడు. చాలా హోటళ్ల కంటే ఇది చాలా పెద్దగా ఉందని చెప్పాడు. తాను ఎక్కడా చూడని విధంగా ఎంతో ప్రశాంతంగా ఉందని తెలిపాడు. ఇదొక జేమ్స్ బాండ్, ప్లేబాయ్ మాన్షన్ అంటూ పొగిడేశాడు. అంతేగాక, కాంక్రీట్, అద్దాలతో చేసిన అద్భుత భవనమని చెప్పాడు.

'నేను ఐదు రోజులపాటు తన భవంతిలా భావించా. దీంట్లో ఓ గది ఇస్తే చాలని భావించా. అయితే నాకోసం మొత్తం బంగ్లాను కేటాయించారు. నేనెక్కడికి వెళ్లినా వెంట ఇద్దరు పనివాళ్లు ఉండేవారు. ఆ విల్లాలో నేను రాజులా గడిపాను. విల్లా మొత్తం కలియతిరిగాను. పూల్ దగ్గరకు వెళ్లగానే కింగ్ ఫిషర్ బీర్లు తీసుకువస్తారు. ఆ విల్లాలో ఎక్కడికి వెళ్లినా కింగ్ ఫిషర్ బీర్లు రెడీగా ఉంటాయి. గోల్ఫ్ కోర్టులో విహరించా'నని గేల్ భవంతి గురించి చెప్పుకొచ్చాడు.

ఇంకా చెబుతూ..'భోజనం ఏం తీసుకుంటారని వంటమనిషి అడిగితే మెనూ అడిగా. దానికి అతను.. మెనూ లేదు సార్, మీరే మెనూ అని బదులిచ్చాడు. విల్లాలోనే థియేటర్‌లో సినిమా చూశా. గ్యారేజీలోకి వెళ్లి చూస్తే మెర్సిడెజ్ సహా చాలా కార్లు ఉన్నాయి' అని తెలిపాడు. అయితే తనకు మూడు చక్రాల హార్లీ డేవిడ్సన్ బైక్ నచ్చిందని చెప్పాడు.

'మాల్యా విదేశాలకు వెళ్లినపుడు ఓ యువకుడు దీనిపై వెళ్తుండగా చూశాడట. ఈ బైక్‌ను చూసి ముచ్చటపడిన మాల్యా వెంటనే దీన్ని తనకు అమ్మమని ఆ యువకుడిని కోరాడట. మాల్యా బాస్. ఆయన తలచుకుంటే కానిది ఏముంది? ఆ యువకుడు కోరినంత మొత్తం చెల్లించి భారత్‌కు తీసుకువచ్చాడట. ఆ విల్లాలో ఈ బైక్‌ను రైడింగ్ చేసి ఎంజాయ్ చేశా. ఆ సమయంలో టెర్మినేటర్‌గా ఫీలయ్యా. కింగ్ ఫిషర్ విల్లాకు నేనే కింగ్. ఈ విల్లాను విడిచి వెళ్లాలని అనిపించలేదు. అయితే ఐదు రోజుల విరామం పూర్తవడంతో తప్పనిసరిగా అక్కడి నుంచి బయల్దేరాల్సి వచ్చింది' అని మాల్యా భవంతి విశేషాలను, మాల్యాపై పొగడ్తలను తన పుస్తకంలో పేర్కొన్నాడు. అంతేగాక, తనకు మాల్యా మంచి మిత్రుడని చెప్పుకొచ్చాడు గేల్.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X