Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్యాచ్‌లు పట్టడానికే పుట్టావేంట్రా

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల పరంపరకు బ్రేక్ పడింది. గురువారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొందింది. శుభ్‌మన్ గిల్ (43), జోస్ బట్లర్ (39) మెరుపు ఇన్నింగ్స్‌లతో జీటీ 155 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీసినా లాభం లేకపోయింది. జేసన్ హోల్డర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటయింది. విరాట్ కోహ్లి 13 బంతుల్లో 28 పరుగులు చేసి కగిసో రబాడ ఓవర్‌లో ఐదు ఫోర్లతో మెరుపు ఆరంభం ఇచ్చినా, దాన్ని భారీ ఇన్నింగ్ గా మలచుకోలేకపోయిందా జట్టు. మిగిలిన బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు. దేవ్‌దత్ పడిక్కల్ 40 పరుగులు చేసినా జట్టును పతనం నుంచి ఆదుకోలేకపోయాడు. అతనికి సహకారాన్ని అందించేవారు కరవయ్యారు. దీంతో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది.

Five dismissals by Jason Holder push Gujarat Titans to beat RCB for 155 in Ahmedabad Grabs POTM

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్ లో అర్షద్ ఖాన్ 3/22, రషీద్ ఖాన్ 2/19 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.. జేసన్ హోల్డర్. ఈ గేమ్ మొత్తం కూడా అతని చుట్టే తిరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో సగం టీమ్ పెవిలియన్ చేరడానికి కారణం అయ్యాడీ వెస్టిండీస్ ఆల్ రౌండర్. మొత్తం అయిదు వికెట్లు కూలిపోవడంలో కీలకపాత్ర పోషించాడు. అదే సమయంలో క్యాచ్ వివాదం కూడా అతన్నిచుట్టే తిరగడం దీనికి బోనస్.

బౌలింగ్ లో రాణించాడు జేసన్ హోల్డర్. 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. అదే సమయంలో ఫీల్డింగ్ లో కూడా సత్తా చాటాడు. మ్యాచ్ మొత్తం మీద మూడు క్యాచ్‌లు పట్టాడు. కేప్టెన్ రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా క్యాచ్ లను మెరుపువేగంతో అందుకున్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. అక్కడితో ఆగలేదు హోల్డర్. వికెట్ కీపర్ జితేష్ శర్మ, ఆల్ రౌండర రొమారియో షెప్పర్డ్ వికెట్లు తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు.

Story first published: Friday, May 1, 2026, 11:15 [IST]
Other articles published on May 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+