న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కీపర్‌గా రాహుల్ సరే.. మరి రిషబ్ పంత్ పరిస్థితేంటి?: గంభీర్

Gautam Gambhir Responded On Team India's Keeping Position ! || Oneindia Telugu
What happens to Rishabh Pant? Asks Gautam Gambhir after KL Rahuls rise as wicket-keeper

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా సమష్టిగా చెలరేగి విజయాన్నందుకుంది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ అద్భుత పెర్పామెన్స్ ఇండియాకు కలిసొచ్చింది. ముఖ్యంగా గాయంతో రిషభ్ పంత్ దూరమవడంతో కీపింగ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్ అదరగొట్టాడు. వికెట్ల వెనుకాల తడబడుతున్న పంత్ కన్నా అద్భుతంగా రాణించాడు. అంతేకాకుండా తన మార్క్ కీపింగ్‌తో లెజెండరీ కీపర్ మహేంద్రసింగ్ ధోనిని గుర్తుచేశాడు. దీంతో అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు రాహుల్ కీపింగ్‌ను కొనియాడారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం రాహుల్‌ను మరికొన్ని మ్యాచ్‌లు కీపర్‌గా కొనసాగిస్తామని తెలిపాడు. దీంతో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రశ్నిస్తున్నాడు. కీపర్‌గా రాహుల్ కొనసాగించడం సరే.. కానీ ఇప్పటికే ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన పంత్‌ భవిష్యత్తు ఏంటని ఓ జాతీయచానెల్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. అలాగే ఈ డ్యూయల్ రోల్ విషయం రాహుల్‌కు తెలిపారా? అతను ఇష్టపూర్వకంగానే అంగీకరించాడా? అనే ప్రశ్నలను ఉటంకించాడు.

ఆ విషయం ధోనికి బాగా తెలుసు.. కోహ్లీ కెప్టెన్సీపై సెహ్వాగ్ పరోక్ష వ్యాఖ్యలుఆ విషయం ధోనికి బాగా తెలుసు.. కోహ్లీ కెప్టెన్సీపై సెహ్వాగ్ పరోక్ష వ్యాఖ్యలు

కేఎల్ రాహుల్ సూపర్ ప్లేయర్..

కేఎల్ రాహుల్ సూపర్ ప్లేయర్..

‌‘భారత క్రికెట్‌కు దొరికిన సూపర్ ప్లేయర్ కేఎల్ రాహుల్. అతని ఫిట్‌నెస్, నాయకత్వ లక్షణాలు, బ్యాటింగ్ శైలి రాహుల్ ప్రత్యేకతను చాటుతాయి. కార్పొరేట్ పరిభాషలో భారత క్రికెట్‌కు రాహుల్ ఓ అమూల్యమైన ఆస్తి. రిషభ్ పంత్ కంకషన్ బ్రేక్‌తో కీపింగ్ బాధ్యతలను తీసుకున్న రాహుల్ సమర్థవంతంగా నిర్వర్తించాడు. దీంతో అతను అప్‌కమింగ్ లిమిటెడ్ ఓవర్లలో కీపర్‌గా కొనసాగుతాడనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటుదని భావిస్తున్నా.

వీటిని పరిగణలోకి తీసుకున్నారా?

వీటిని పరిగణలోకి తీసుకున్నారా?

‘అయితే రాహుల్ కీపర్‌గా కొనసాగించే ముందు డిసిషన్ మేకర్స్ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారా? లేదా? అన్నది నాకు కావాలి. ఈ విషయం గురించి రాహుల్‌తో చర్చించారా?, అతను మనస్పూర్తిగా ఈ బాధ్యతలను స్వీకరించేందుకు ముందుకు వచ్చాడా? లేక నో అని చెప్పలేక రిస్క్ తీసుకుంటున్నాడా?'అని గంభీర్ తన కాలమ్‌లో టీమ్‌మేనేజ్‌మెంట్‌ను ఉద్దేశించి ప్రశ్నించాడు.

జట్టుకే కష్టం..

జట్టుకే కష్టం..

‘ఇక రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి? టెక్నిక్ విషయంలో ఇబ్బంది పడుతున్న పంత్ ఆత్మవిశ్వాసం ఇప్పటికే సన్నగిల్లింది. అలాంటిది రాహుల్ కీపింగ్ వ్యవహారాన్ని అతను ఎలా స్వీకరిస్తాడో నాకైతే తెలియదు. అతను అసంతృప్తికిలోనైతే జట్టుకే ప్రమాదం. అతని భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన అవసరం టీమ్‌మేనేజ్‌మెంట్‌కు ఉంది'

Story first published: Tuesday, January 21, 2020, 16:41 [IST]
Other articles published on Jan 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X