న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో రోహిత్‌ మరో ఘనత.. కోహ్లీ రికార్డు బద్దలు

IND vs WI 2019 : Rohit Sharma Surpasses Virat Kohli To Shatter Massive T20I Record || Oneindia
West Indies vs India, 2nd T20I: Openar Rohit Sharma surpasses Virat Kohli to shatter T20I record

లాడర్‌హిల్‌: టీమిండియా ఓపెనర్‌ 'హిట్ మ్యాన్' రోహిత్‌ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. క్రీజులోకి దిగాడంటే అర్ధ సెంచరీ, సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రపంచకప్‌-2019లో అయితే ఏకంగా ఐదు సెంచరీలు చేసి లంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ తన ఫామ్‌ను విండీస్ పర్యటనలో కూడా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ ఓ రికార్డు నెలకొల్పాడు.

<strong>విరామ సమయం.. ఆర్మీ బెటాలియన్‌తో వాలీబాల్ ఆడిన ధోనీ (వీడియో)</strong>విరామ సమయం.. ఆర్మీ బెటాలియన్‌తో వాలీబాల్ ఆడిన ధోనీ (వీడియో)

కోహ్లీని దాటినా రోహిత్:

కోహ్లీని దాటినా రోహిత్:

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరిగిన రెండో టీ20లో రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసాడు. దాంతో తన అంతర్జాతీయ కెరీర్‌లో 21వ సారి యాభైకి పైగా స్కోరును సాధించాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో యాభైకి పైగా స్కోర్లను సాధించిన జాబితాలో రోహిత్ శర్మ మొదటి స్థానంలోకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లి రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ 20 సార్లు యాభైకి పైగా స్కోర్లను నమోదు చేసాడు.

ఒక్క సెంచరీ లేదు:

ఒక్క సెంచరీ లేదు:

రోహిత్‌ శర్మ యాభైకి పైగా సాధించిన స్కోర్లలో 17 హాఫ్‌ సెంచరీలు.. 4 సెంచరీలు ఉన్నాయి. ఇందులో అత్యధిక స్కోర్ 118. కోహ్లీ యాభైకి పైగా సాధించిన స్కోర్లలో 20 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. టీ20లలో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అత్యధిక స్కోర్ 90 నాటౌట్. యాభైకి పైగా సాధించిన స్కోర్ల జాబితాలో మార్టిన్‌ గప్టిల్‌ (16), క్రిస్‌ గేల్‌ (15), బ్రెండన్‌ మెకల్లమ్‌ (15)లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఆ రికార్డు కోహ్లీ పేరిటే:

ఆ రికార్డు కోహ్లీ పేరిటే:

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు సాధించిన ఘనత మాత్రం విరాట్ కోహ్లీ పేరిటే ఉంది. కోహ్లీ 20 హాఫ్‌ సెంచరీలతో టాప్‌లో ఉండగా.. 17 హాఫ్‌ సెంచరీలతో రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక బౌండరీలు (225) సాధించిన క్రికెటర్‌గా కూడా కోహ్లీ నిలిచాడు. శ్రీలంక మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్‌ (223) రెండో స్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. రైనాను దాటినా కోహ్లీ

గేల్‌ రికార్డు బద్దలు:

గేల్‌ రికార్డు బద్దలు:

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (67; 51 బంతుల్లో 6×4, 3×6) మూడు సిక్సర్లు బాది టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు (107) కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. విండీస్ ఓపెనర్ క్రిస్‌ గేల్‌ (105) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు. ఈ సిరీస్‌కు ముందు రోహిత్‌ 102 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి టీ20లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్.. రెండో టీ20లో మూడు సిక్సర్లతో గేల్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో కివీస్ ఓపెనర్ మార్టిన్‌ గప్తిల్‌ (103) మూడో స్థానంలో ఉన్నాడు.

Story first published: Monday, August 5, 2019, 12:22 [IST]
Other articles published on Aug 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X