న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండిస్ 45 ఆలౌట్‌: రెండో టి20లో ఇంగ్లాండ్‌దే విజయం

West Indies skittled for 45 as England win T20 series - as it happened

హైదరాబాద్: వెస్టిండిస్ జట్టు అంటేనే టీ20లకు పెట్టింది పేరు. అయితే, సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఘోరంగా ఓడిపోయింది. ఇంగ్లాండ్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ (4/6) విజృంభించడంతో రెండో టి20లో విండిస్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో 45 పరుగులకే కుప్పకూలిన విండీస్‌.. శ్రీలంక (39) తర్వాత అంతర్జాతీయ టి20ల్లో రెండో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ జట్టులో జో రూట్‌ (55; 40 బంతుల్లో 7 ఫోర్లు), బిల్లింగ్స్‌ (87; 47 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులు) చెలరేగడంతో ఇంగ్లాండ్‌ 6 వికెట్లకు 182 పరుగుల భారీ స్కోరు చేసింది. వెస్టిండీస్‌ బౌలర్లలో అలెన్‌ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ బౌలర్లు జోర్డాన్‌ (4/6), విల్లీ (2/18), రషీద్‌ (2/12), ప్లంకెట్‌ (2/8) ధాటికి విండీస్‌ విలవిల్లాడిపోయింది. మూడో ఓవర్లో గేల్‌ (5), హోప్‌ (7)లను విల్లీ ఔట్‌ చేసి విండిస్ పతనాన్ని ప్రారంభించగా.. నాలుగో ఓవర్లో డారెన్‌ బ్రావో (0), హోల్డర్‌ (0)లను జోర్డాన్‌ డకౌట్‌ చేశాడు.

ఆ తర్వాత 6వ ఓవర్లో పూరన్‌ (1), అలెన్‌ (1) వికెట్లు కూడా ఖాతాలో వేసుకున్నాడు. 22/6తో పీకలోతు కష్టాల్లో చిక్కుకున్న వెస్టిండిస్ ఆ తర్వాత మిగిలిన 4 వికెట్లను 23 పరుగుల తేడాతో కోల్పోయింది. ఆతిథ్య జట్టు 11.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలింది. హెట్‌మయర్‌ (10), బ్రాత్‌వైట్‌ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే ఇంగ్లాండ్‌ 2-0తో గెలుచుకుంది. ఇరు జట్ల మధ్య మూడో టి20 నేడు జరుగుతుంది.

Story first published: Sunday, March 10, 2019, 11:40 [IST]
Other articles published on Mar 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X