న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కారణం ఇదీ: పుణె వన్డేలో విండిస్ ఆటగాళ్ల చేతికి నల్లబ్యాండ్

India Vs West Indies 2018, 3rd ODI :This Is The Reason For WIndies Cricket Team Tie Black Armbands?
West Indies cricket team tie armbands remembering Black History Month.

హైదరాబాద్: పుణె వేదికగా ఆతిథ్య భారత జట్టుతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండిస్ జట్టు 43 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ జట్టు ఆటగాళ్లు చేతికి నల్లబ్యాండ్‌ ధరించి బరిలోకి దిగారు. అయితే, విండిస్ ఆటగాళ్లు తమ చేతికి చేతికి నల్లబ్యాండ్‌ ధరించడానికి కారణం ఏంటని ప్రతి ఒక్కరూ ఆరా తీశారు.

విరాట్ కోహ్లీ సెంచరీ వృథా: పుణె వన్డేలో భారత్ ఓటమివిరాట్ కోహ్లీ సెంచరీ వృథా: పుణె వన్డేలో భారత్ ఓటమి

అయితే, ఇందుకు గల కారణం ఏంటంటే మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వెస్టిండీస్‌, ఆఫ్రికా దేశాల నుంచి నల్లజాతి సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యుద్ధంలో వారు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రస్తుతం ఆ దేశస్థులు బ్లాక్‌ హిస్టరీ నెలను జరుపుకొంటున్నారు.

 బ్లాక్‌ హిస్టరీ నెల

బ్లాక్‌ హిస్టరీ నెల

యుద్ధంలో తోడ్పాటుగా పెద్ద సంఖ్యలో సైనికులను, డబ్బు, యుద్ధానికి కావాల్సిన సామగ్రిని నల్లజాతీయులు పంపిణీ చేసినా.. తెల్లజాతి సైనికులతో సమానంగా పోరాటం చేయలేరని, వారి పట్ల జాతి అహంకారానికి పాల్పడ్డారు. ఈ కారణం చేత ప్రస్తుతం కరీబియన్‌, ఆఫ్రికన్‌ దేశస్థులు ప్రస్తుతం బ్లాక్‌ హిస్టరీ నెలను జరుపుకుంటున్నారు.

 మూడో వన్డేలో చేతికి నలుపు రంగు బ్యాండ్‌

మూడో వన్డేలో చేతికి నలుపు రంగు బ్యాండ్‌

ఇందులో భాగంగా నల్లజాతి సైనికుల సేవలకు గుర్తింపుగా విండీస్‌ ఆటగాళ్లు కూడా మద్దతుగా మూడో వన్డేలో చేతికి నలుపు రంగు బ్యాండ్‌ ధరించి మ్యాచ్‌ ఆడారు. ఇదిలా ఉంటే పుణె వన్డేలో విజయంతో వెస్టిండిస్ జట్టు ఐదు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో ఈ సిరిస్‌లో మిగిలిన రెండు వన్డేలు సిరీస్ విజయానికి ఇరు జట్లకు కీలకంగా మారాయి.

50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 283 పరుగులు

50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 283 పరుగులు

కాగా, పుణె వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో హోప్(95) తృటిలో సెంచరీని కోల్పోయాడు. చివర్లో నర్స్(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

 వన్డేల్లో విరాట్ కోహ్లీ 38వ సెంచరీ

వన్డేల్లో విరాట్ కోహ్లీ 38వ సెంచరీ

అనంతరం 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకోవడంతో కష్టాల్లో పడింది. ఒత్తిడిలో కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరసగా మూడో వన్డేలోనూ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ(107) సెంచరీ వృథా అయింది. శిఖర్ ధావన్(35) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో భారత్ 47.4 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Monday, October 29, 2018, 12:10 [IST]
Other articles published on Oct 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X