న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మ‌ృతి.. శోకసంధ్రంలో క్రికెట్ ప్రపంచం!

West Indies crickets founding father Everton Weekes passes away at the age of 95

న్యూఢిల్లీ: వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ ఎవర్టన్ వీక్స్ (95) మృతిచెందారు. గతేడాది నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ ఆటగాళ్లైన త్రీ డబ్ల్యూస్‌‌‌లో ఎవర్టన్ వీక్స్ ఒకరు. 1948-58 మధ్య కాలంలో వెస్టిండీస్‌‌కు చెందిన ప్రాంక్‌ వారెల్‌, క్లయిడ్‌ వాల్కట్‌, ఎవర్టన్‌ వీక్స్‌లు తమ అద్భుత ప్రదర్శనతో దశాబ్దంపాటు వరల్డ్‌ క్రికెట్‌ని శాసించారు. వెస్టిండీస్ క్రీడల పితామహుడిగా భావించే ఎవర్టన్ మృతి పట్ల విండీస్ క్రికెట్ బోర్డు నివాళులు అర్పించింది.

మా గుండెలు రోదిస్తున్నాయి..

మా గుండెలు రోదిస్తున్నాయి..

‘ఐకాన్ ప్లేయర్ మా హీరో, సర్ ఎవర్టన్ వీక్స్ లేడనే వార్తతో మా గుండెలు రోదిస్తున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు మా ప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.'అని ట్వీట్ చేసింది. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన త్రీ డబ్ల్యూస్‌లో ప్రాంక్‌ వారెల్‌ 1967లో మరణించగా.. క్లయిడ్‌ వాల్కట్‌ 2006లో మృతి చెందాడు.

 ఐసీసీ, లక్ష్మణ్ నివాళీ..

ఐసీసీ, లక్ష్మణ్ నివాళీ..

‘వెస్టిండీస్ క్రికెట్‌కి ఎవర్టన్‌ వీక్స్‌ మార్గదర్శకుడు. అద్భుతమైన క్రికెటర్.. మంచి మనసున్న వ్యక్తి కూడా. అతని ఆత్మకి శాంతి చేకూరాలి'' అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రికీ స్కెరిట్ నివాళి అర్పించాడు. రిటైర్మెంట్ తర్వాత సుదీర్ఘకాలం ఐసీసీ మ్యాచ్ రిఫరీగా కూడా ఎవర్టన్‌ వీక్స్‌ పనిచేశాడు. దాంతో.. ఐసీసీతో పాటు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా అతనికి నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. వీరితో యావత్ క్రికెట్ లోకం నివాళులు అర్పిస్తుంది.

 చెక్కుచెదరని రికార్డు..

చెక్కుచెదరని రికార్డు..

వెస్టిండీస్ తరఫున 1948-58 మధ్య కాలంలో టెస్టులాడిన ఎవర్టన్‌ వీక్స్‌.. 58.62 సగటుతో 4,455 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు ఉండగా.. 1948లో ఇంగ్లండ్, భారత్‌పై వరుసగా ఐదు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు నమోదు చేశాడు. ఇక ఆరో సెంచరీని తృటిలో చేజార్చుకున్న 90 పరుగులు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. క్రికెట్ ప్రపంచంలో మరే క్రికెటర్ కూడా టెస్టుల్లో ఇలా వరుసగా ఐదు సెంచరీలు బాదలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు.. ఫస్ట్ క్లాస్‌లోనూ ఎవర్టన్‌ వీక్స్‌‌కు మెరుగైన రికార్డ్ ఉంది. కెరీర్‌లో 152 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఎవర్టన్‌ వీక్స్‌ 55.34 సగటుతో 12,010 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు అజేయ 304 పరుగులు.

Story first published: Friday, July 3, 2020, 9:11 [IST]
Other articles published on Jul 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X