న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మా వాళ్లు నైపుణ్యమున్నా అమలుచేయలేకపోతున్నారు'

West Indies cricket has talent but need to apply it right, says outgoing coach Stuart Law

హైదరాబాద్: భారత పర్యటనలో ఏ ఒక్క సిరీస్‌లోనూ విజయం దక్కించుకోలేని వెస్టిండీస్ పట్ల ఆ జట్టు కోచ్ నిరాశ వ్యక్తం చేస్తున్నాడు. దాంతో పాటుగానే తమ క్రికెటర్లు ఎలాంటి పొరబాట్లు చేశారనే విషయాన్ని విశ్లేషిస్తున్నాడు. ప్రస్తుత విండీస్‌ జట్టులో ప్రతిభకు కొరత లేదని తెలిపాడు. ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు వారి ప్రణాళికలను సరిగా అమలు చేయలేకపోవడమే ప్రధాన లోపమని స్టువర్ట్‌ లా పేర్కొన్నాడు.

రెండో టీ20లో విండీస్‌ 71పరుగుల తేడాతో

రెండో టీ20లో విండీస్‌ 71పరుగుల తేడాతో

ప్రస్తుతం తడబాటుకు లోనవుతున్న విండీస్‌ ఆటగాళ్లు కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుందని ఆయన చెప్పాడు. అయితే త్వరలోనే విండీస్‌ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తారని లా విశ్వాసం వ్యక్తం చేశాడు. లక్నో వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో విండీస్‌ 71పరుగుల తేడాతో ఓడిపోయి.. టీ20 సిరీస్‌నూ కోల్పోయింది.

మార్పు చెందుతున్న దశలో కరీబియన్లు

మార్పు చెందుతున్న దశలో కరీబియన్లు

ఇప్పటివరకూ ముగిసిన రెండు టెస్టుల్లోనూ 2-0తో, 3-1తో పరాజయాన్ని మూటగట్టుకున్న విండీస్‌ జట్టు ఒక్క సిరీస్‌ విజయం లేకుండా ఒట్టి చేతుల్తో తిరుగు ప్రయాణం చేయాల్సిందే. ఈ క్రమంలో తమ ఆటగాళ్ల ప్రదర్శనపై పూర్తిస్థాయి నమ్మకం ఉందని కోచ్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. దీని గురించి మాట్లాడుతూ.. కరీబియన్లు ప్రస్తుతం మార్పు చెందుతున్న దశలో ఉన్నారు. ఈ క్రమంలో అత్యుత్తమ ఆటను ప్రదర్శించడానికి ఇంకాస్త సమయం పడుతుంది.

నేర్చుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పనే

నేర్చుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పనే

జట్టులో ప్రతిభకు ఏ మాత్రం కొరత లేదు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణించగల సత్తా ఉన్నవారే. అయితే ఆట మధ్య స్థాయిలో ఉన్నప్పుడు వారు తీవ్ర ఒత్తిడికి గురై.. ముందుగా రచించుకున్న వ్యూహాలు సరిగా అమలుచేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేర్చుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పనేనంటూ కోచ్‌ చెప్పుకొచ్చాడు. అనుభవలేమి కూడా ఓ రకంగా కారణమనేనని తెలిపాడు.

యువ ఆటగాళ్లు చాలా నేర్చుకున్నారని

యువ ఆటగాళ్లు చాలా నేర్చుకున్నారని

మరోవైపు భారత్‌ వంటి అత్యుత్తమ జట్టుతో ఆడటం వెస్టిండీస్ జట్టుకు మంచి అనుభవం నేర్పిందని వెల్లడించాడు. ఈ పర్యటనలో యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చుకున్నారని పేర్కొన్నాడు. ఇప్పటికే టీ20 సిరీస్‌ను కోల్పోయిన విండీస్‌.. చివరి మ్యాచ్‌లోనైనా సత్తా చాటి విజయంతో స్వదేశానికి చేరుకోవాలని భావిస్తున్నట్లు కోచ్‌ చెప్పాడు.

Story first published: Wednesday, November 7, 2018, 15:04 [IST]
Other articles published on Nov 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X