న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రాకి పనిభారం తగ్గించాలి, మయాంక అగర్వాల్‌పై కన్ను: ఎమ్మెస్కే

By Nageshwara Rao
We have to be careful about Bumrah's workload: MSK Prasad

హైదరాబాద్: టెస్టుల్లో కూడా రాణిస్తున్న టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై పనిభారం లేకుండా చూసుకోవాలని సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో బుమ్రా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. సఫారీ గడ్డపై బుమ్రా మొత్తం 162.1 ఓవర్లు వేయగా, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లోనే 112.1 ఓవర్లు వేయడం విశేషం.

దీంతో దక్షిణాఫ్రికా పర్యటనలో బుమ్రా ప్రదర్శన ఆనందాన్నిచ్చిందని, అతనిపై పూర్తి నమ్మకం ఉందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'జస్ర్పీత్‌ బుమ్రా ప్రదర్శన పట్ల మేమెంతో సంతోషంగా ఉన్నాం. రంజీల్లో గుజరాత్‌ తరఫున రాణించిన అతడి సామర్థ్యంపై మాకెంతో నమ్మకం ఉంది' అని తెలిపాడు.

 బుమ్రాపై పని ఒత్తిడి ఉండకూడదు

బుమ్రాపై పని ఒత్తిడి ఉండకూడదు

'అయితే రానున్న రోజుల్లో ఆడాల్సిన అంతర్జాతీయ మ్యాచ్‌ల నేపథ్యంలో బుమ్రాపై పని ఒత్తిడి ఉండకూడదు. బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ భిన్నంగా ఉంటుంది. గాయాలయ్యే అవకాశం ఎక్కువ. అతను ఎక్కువగా ఆడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కీలకమైన సిరీస్‌ల్లో తప్ప అతడిని అతిగా వినియోగించుకోకూడదని భావిస్తున్నాం' అని అన్నాడు.

 కుల్దీప్‌, చాహల్‌ ప్రదర్శనలపై ప్రశంసల వర్షం

కుల్దీప్‌, చాహల్‌ ప్రదర్శనలపై ప్రశంసల వర్షం

సఫారీ గడ్డపై వన్డే సిరీస్‌లో 33 వికెట్లు తీసిన మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌ ప్రదర్శనలపై ఎమ్మెస్కే ప్రశంసల వర్షం కురిపించాడు. 'మణికట్టు స్పిన్నర్లను మేం వికెట్లు తీసే పెట్టుబడిగా భావిస్తాం. వారిద్దరూ (చాహల్‌, కుల్దీప్‌) మా అంచనాలు అందుకున్నారు. అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌తో మూడు ఫార్మాట్లలో అద్భుతమైన స్పిన్నర్లను తయారు చేసినందుకు సంతోషంగా ఉన్నాం' అని ఎమ్మెస్కే తెలిపాడు.

 రిజర్వ్ బెంచ్ సత్తాపై ఇలా

రిజర్వ్ బెంచ్ సత్తాపై ఇలా

ఇక, రిజర్వ్ బెంచ్ సత్తాపై కూడా ఎమ్మెస్కే స్పందించాడు. 'సఫారీ గడ్డపై టీమిండియా అద్భుతంగా ఆడింది. ఈ విజయాన్ని మేం మాకున్న రిజర్వు బెంచ్‌కు అంకితం చేస్తాం. ప్రతి స్థానానికి ఎక్కువ మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. లంక సిరీస్‌కు పాండ్యాకు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో విజయ్‌ శంకర్‌‌ను ఎంపిక చేశాం. తద్వారా విజయ్ శంకర్ రూపంలో మరో బ్యాకప్‌ ఆల్‌ రౌండర్‌ను తయారు చేయాలనుకుంటున్నాం' అని పేర్కొన్నాడు.

 మయాంక్‌ అగర్వాల్‌ను ఉద్దేశించి ఎమ్మెస్కే కీలక వ్యాఖ్యలు

మయాంక్‌ అగర్వాల్‌ను ఉద్దేశించి ఎమ్మెస్కే కీలక వ్యాఖ్యలు

దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో రాణిస్తోన్న మయాంక్‌ అగర్వాల్‌ను ఉద్దేశించి ఎమ్మెస్కే కీలక వ్యాఖ్యలు చేశాడు. 'తన స్థానం ఏంటో తెలుసుకోవడంలో ఏ ఆటగాడూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని సంప్రదించవచ్చు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన మయాంక్‌తో మాట్లాడాను. అతడు జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంటాడు. అదే విషయాన్ని మయాంక్‌కు చెప్పా. మరేం ఫర్వాలేదు. మీ దృష్టి నాపై ఉంది చాలని నాతో చెప్పాడు' అని ఎమ్మెస్కే పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి మయాంక అగర్వాల్ 2141 పరుగులు చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, March 1, 2018, 11:25 [IST]
Other articles published on Mar 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X