న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవిచంద్రన్ అశ్విన్‌ను అందుకే ఆడించలేదు.. మీరు కూడా చూశారుగా..! సమర్థించుకున్న రాహుల్ ద్రావిడ్

We Felt The Wicket is Not Appropriate for Spinners So We went with Four Seemers says Dravid

ఇంగ్లాండ్‌తో జరిగిన అయిదో టెస్ట్‌లో కేవలం ఒక స్పిన్నర్‌‌ను మాత్రమే తీసుకోవాలనే తన నిర్ణయాన్ని భారత కోచ్ రాహుల్ ద్రావిడ్ సమర్థించుకున్నాడు. ఈ పిచ్ మీద తగినంత స్పిన్ పడదని చెప్పాడు. ఇక జానీ బెయిర్‌స్టో, జో రూట్ ఇద్దరు చెరో సెంచరీ చేయడంతో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొంది 2-2తో సిరీస్ సమం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్‌లో రవిచంద్రన్ అశ్విన్ లేకపోవడం చాలా చర్చనీయాంశమైంది. టెస్ట్ క్రికెట్లో నంబర్ 2 ఆల్రౌండర్, బౌలర్ అయిన అశ్విన్‌ను పక్కన పెట్టడం పట్ల చాలా మంది మాజీలు ద్రావిడ్ నిర్ణయం పట్ల తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కేవలం ఒక్క స్పిన్నర్‌తో వెళ్లాలన్న మీ నిర్ణయం సరైనదేనంటారా.. శార్దూల్ ఠాకూర్‌ను పెద్దగా ఉపయోగించుకోనప్పుడు అశ్విన్‌ను తీసుకుంటే ఏమయ్యేది అని ద్రావిడ్‌ను మ్యాచ్ అనంతరం విలేకరులు ప్రశ్నించగా.. అతను క్లారిటీ ఇచ్చాడు.

శార్దూల్‌ను సరిగా ఉపయోగించలేదా.. కరెక్ట్ కాదు

శార్దూల్‌ను సరిగా ఉపయోగించలేదా.. కరెక్ట్ కాదు

'మీరు చెబుతున్నదానితో నేను అంగీకరించను. శార్దూల్ ఠాకూర్‌ను మేం సరిగ్గా ఉపయోగించుకోలేదని మీరంటున్నారు. నేను దాన్ని ఏకీభవించను. మీరు గతంలో అతని ప్రదర్శనలు చూడండి. శార్దూల్ గతంలో టెస్ట్ మ్యాచ్‌లలో ఎంతో బాగా ఆడాడు. కొన్ని గేమ్‌లలో మ్యాచ్ నిలబడే ప్రదర్శనలు చేశాడు. అతనికి ఈ మ్యాచ్‌లో అవసరమైన టైంలో బౌలింగ్ వేశాడు. కానీ ప్రతిసారి వికెట్లు పడాలని ఏమీ ఉండదు కదా' అని ద్రావిడ్ పేర్కొన్నాడు. ఇక అశ్విన్‌ను ప్లేయింగ్ లైనప్ నుండి తప్పించడం చాలా కష్టమని.. అయితే ఫాస్ట్ బౌలర్‌లకు కాస్త ఎక్కువ ఎడ్జ్ ఉండే పిచ్‌ ఉండడంతోనే అశ్విన్‌కు బదులు నాలుగో పేసర్‌ను ఆడించినట్లు ద్రావిడ్ తెలిపాడు.

స్పిన్ పడలేదు

స్పిన్ పడలేదు

'టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ లాంటి బౌలర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం నిజంగా కొంచెం ఇబ్బందికరమే. కానీ మేము మొదటి రోజు వికెట్‌ను చూసినప్పుడు.. చాలా మంచి గ్రాస్‌తో పేస్‌కు అనుకూలంగా ఉంటుదనిపించింది. ఇది ఫాస్ట్ బౌలర్ల కోసం బాగా ఉపయుక్తమవుతుందనిపించింది. స్పిన్ అంత ప్రభావవంతగా పడలేదని దాదాపు చివరి రోజు కూడా మనకు అర్థమైంది. జాక్ లీచ్ లేదా రవీంద్ర జడేజా బౌలింగ్ ప్రదర్శనలను బట్టి దీన్ని మనం అంచనా వేసుకోవచ్చు.' అని ద్రావిడ్ స్పిన్ ప్రభావవంతంగా లేదనే విషయాన్ని పేర్కొన్నాడు.

 ఇంగ్లాండ్ మా కంటే బాగా ఆడింది

ఇంగ్లాండ్ మా కంటే బాగా ఆడింది

ఇక మనకు బయటి నుంచి ఇది జరిగితే బాగుండు.. వాళ్లను తీసుకుంటే బాగుండు అని కొన్ని సందర్భాల్లో అనిపించడం కామన్. నేను మాత్రం ఒక్క విషయాన్ని అంగీకరిస్తున్నాను. ఇంగ్లాండ్ మా కంటే మెరుగ్గా ఆడింది అని ద్రావిడ్ స్పష్టం చేశాడు. ఇక చివరి ఇన్నింగ్స్‌లో 378పరుగుల ఛేదనను ఇంగ్లాండ్ కేవలం 3వికెట్లు కోల్పోయి మాత్రమే ఛేదించగలిగిందంటే.. భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపారో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ బుమ్రా తప్పా.. మిగతా బౌలర్లు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇక టెస్ట్ అంటేనే వికెట్ టేకర్లు కావాలి. రన్స్ ఇచ్చినా వికెట్ టేకర్స్ తప్పకుండా అవసరం అవుతుంది. ఈ క్రమంలో భారత్ నాణ్యమైన వికెట్ టేకర్ల కోసం అన్వేషించాల్సిన అవసరమున్నట్లు స్పష్టమవుతుంది.

Story first published: Tuesday, July 5, 2022, 23:01 [IST]
Other articles published on Jul 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X