Urvashi Rautela పంత్ జర మన్నించు.. చేతులు జోడించి క్షమాపణలు కోరిన బాలీవుడ్ బ్యూటీ! (వీడియో)

న్యూఢిల్లీ: తనతో సెక్స్ చేయడానికి తెగ ఆరాటపడ్డాడని టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా.. అనూహ్యంగా అతన్ని క్షమాపణలు కోరింది. ఆసియాకప్ 2022 టోర్నీకి ముందు సోషల్ మీడియా వేదికగా పంత్‌తో మాటల యుద్దం నడిపిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఉన్నట్లుండి యూటర్న్ తీసుకుంది. రిషభ్ పంత్ పేరును ప్రస్తావించకుండా తన కోసం హోటల్ గదిలో వేచి చూసాడని ఓ ఇంటర్వ్యూలో రౌటేలా చెప్పగా.. పాపులారిటీ కోసం ఇంత దిగుజారుతారా? అంటూ భారత వికెట్ కీపర్ కౌంటరిచ్చాడు. దాంతో రెచ్చిపోయిన ఊర్వశీ బ్యాట్ బాల్ ఆడుకోవాలని, నకరాలు చేస్తే ఇజ్జత్ తీస్తానని హెచ్చరించింది.

తనతో సెక్స్ చేయాలనుకున్నాడని..

తనతో సెక్స్ చేయాలనుకున్నాడని..

'అరే ఓ చోటు భయ్యా.. బ్యాట్ బాల్ ఆడుకో. నేను చిన్నపిల్లను కాదు. నీలాంటి పిల్ల బచ్చాల వల్ల బద్నాం అవ్వడానికి. ఆర్‌పీ చోటు భయ్యా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సైలెంట్‌గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నువ్వో కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో శారీరక సంబంధం కోరుకునే పురుషుడు). నీ ఇజ్జత్ తీస్తా'అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనికి ఆర్‌పీ చోటు భయ్యా, కౌగర్ హంటర్, డోంట్‌ టేక్‌ అడ్వాంటేజ్‌ ఆఫ్‌ ఏ సైలెంట్‌ గర్ల్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసింది. దీనికి పంత్ సైతం తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. మన ఆధీనంలో లేని విషయాలను ఏ మాత్రం పట్టించుకోవద్దని బదులిచ్చాడు.

నసీమ్‌షాపై కన్నేసింది..

నసీమ్‌షాపై కన్నేసింది..

అనంతరం ఆసియాకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఊర్వశీ హాజరవ్వడం చర్చనీయాంశమైంది. పంత్ కోసమే వచ్చిందని, అతన్ని రెచ్చగొట్టడానికేనని అభిమానులు ఆరోపించారు. ఊర్వశీ మాత్రం పంత్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా పాకిస్థాన్ యువ పేసర్ నసీమ్ షా‌ను ఉద్దేశించి ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఊర్వశి సిగ్గుపడుతుండగా.. నసీమ్ పదే పదే ఆమెను చూస్తూ కనిపించాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందంటూ పుకార్లు వెలువడ్డాయి.

పాపం.. వదిలేయండి

పాపం.. వదిలేయండి

ఈ వ్యవహారంపై నసీమ్ షాను పాకిస్థాన్ మీడియా వివరణ కోరగా... అసలు ఊర్వశీ రౌటేలా ఎవరో కూడా తనకు తెలియదని బదులిచ్చాడు. ఆమెతో డేటింగ్ చేయాలనే ఉద్దేశం కూడా తనకు లేదని, తన ఫోకస్ అంతా క్రికెట్‌ పైనే ఉందని చెప్పాడు. ఇక తాను ఎవరో తెలియదంటూ నసీమ్ షా చేసిన వ్యాఖ్యలపై ఊర్వశీ రౌటేలా స్పందించింది. నసీమ్‌షాతో తనకు సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలను ఆపేయాలని ఆమె సోషల్ మీడియా వేదికగా మీడియాను కోరింది. అది సరదా కోసం చేసిన పనని, నసీమ్ షాకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది.

పంత్.. జర క్షమించు..

తాజాగా ఇన్‌స్టాంట్ బాలీవుడ్ అనే చానెల్‌తో మాట్లాడిన ఊర్వశీ రౌటేలా.. రిషభ్ పంత్‌కు ఏం చెప్పాలనుకుంటున్నావని ప్రశ్నించగా.. ఏం లేదనుకుంటేనే క్షమాపణలు చెప్పింది. హోస్ట్ ప్రశ్న వినగానే ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఊర్వశి.. 'నేనేం చెప్పాలనుకుంటున్నానంటే.. ఏం చెప్పాలి.. ఏం చెప్పాలో తెలియడం లేదు. సారీ. ఐయా వేరీ సారీ'అంటూ రెండు చేతులు జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అభిమానులు మాత్రం పంత్‌కు మానసిక ప్రశాంతను అందించాలనే ఊర్వశి ఈ పని చేసిందని కామెంట్ చేస్తున్నారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 13, 2022, 18:07 [IST]
Other articles published on Sep 13, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X