న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: కోహ్లీసేన సరికొత్త ఫీల్డింగ్ డ్రిల్‌ను చూశారా? (వీడియో)

ICC Worrld Cup 2019: Virat Kohli & Team Take Part In Unique Fielding Drill Ahead Of World Cup
WATCH: Team India take part in unique fielding drill ahead of World Cup opener against South Africa


హైదరాబాద్: వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో ఫీల్డింగ్‌ ఎంతో కీలకం. గతంలో క్యాచ్‌లు, రనౌట్ల వల్ల మ్యాచ్ ఫలితాలు తారుమారైన ఎన్నో సందర్భాలను మనం చూశాం. ఫీల్డింగ్‌ విషయంలో క్యాచ్‌లకు సంబంధించినంత వరకూ టీమిండియా ఫరవాలేదు గానీ... డైరెక్ట్‌ త్రోలను విసరడంలో మన ఫీల్డర్లు పూర్తిగా విఫలమవుతున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టీమిండియాను వేధిస్తోన్న ఫీల్డింగ్ సమస్య

దీంతో టీమిండియాను ఫీల్డింగ్‌ సమస్య వేధిస్తోంది. వరల్డ్‌కప్‌లో ఈ బలహీనతను అధిగమించేందుకు గాను ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ ప్రాక్టీస్‌ సెషన్లలో కొత్త పద్థతులతో ఫీల్డింగ్‌ ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ని దక్షిణాఫ్రికాతో ఆడనుంది.

జూన్ 5న దక్షిణాఫ్రికా-భారత్ మ్యాచ్

ఈ మ్యాచ్ జూన్ 5న సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అక్కడి చేరుకున్న టీమిండియా గురువారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంది. ఇందులో భాగంగా ‘రౌండ్‌ ద క్లాక్‌'పై ఎక్కువగా దృష్టి సారించింది. ‘రౌండ్‌ ద క్లాక్‌' అంటే ఆరు విభిన్న ప్రాంతాల్లో ఫీల్డింగ్‌ చేస్తూ నాన్‌స్ట్రయికర్‌వైపు ఉండే వికెట్లను మొత్తం 20సార్లు పడగొట్టడం.

20సార్లు వికెట్‌ పడగొట్టడంలో

20సార్లు వికెట్‌ పడగొట్టడంలో సఫలమైన క్రికెటర్‌ను ఈ సెషన్‌ నుంచి తప్పించారు. విఫలమైన క్రికెటర్‌తో కోచ్ ఆర్.శ్రీధర్ మళ్లీ మళ్లీ ప్రాక్టీస్‌ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.

Story first published: Friday, May 31, 2019, 13:35 [IST]
Other articles published on May 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X