న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గెలుపు ఇచ్చిన ఉత్సాహం: స్టేడియాన్ని శుభ్రం చేసిన పాక్ ఫ్యాన్స్ (వీడియో)

Watch: Pakistan fans stay back to clean stadium after win against New Zealand

హైదరాబాద్: గెలుపు ఇచ్చిన ఉత్సాహాం పాకిస్థాన్ అభిమానుల్ని స్టేడియం శుభ్రం చేసేలా చేసింది. అవును.. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సెమీస్ రేసులో నిలువాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.

మ్యాచ్ గెలిచిన అనంతరం పాక్ అభిమానులు బర్మింగ్‌హామ్ స్టేడియంలోని చెత్తను ఏరివేసి ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా గేమ్‌లో గెలుపొందిన జట్టు మద్దతుదారులంతా స్టాండ్స్‌తో పాటు స్టేడియం పరిసరాల్లో సంబరాలు చేసుకుంటారు. కానీ, పాక్ ఫ్యాన్స్ మాత్రం అందుకు భిన్నంగా స్టాండ్స్‌లోని ఖాళీ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ పేపర్లు, ప్లకార్డులను సేకరించి చెత్తడబ్బాల్లో వేశారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే పాకిస్థాన్ అభిమానులు ఇప్పుడు ఆదివారం ఇంగ్లాండ్‌పై భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంగ్లాండ్‌పై టీమిండియా గెలిస్తేనే పాక్ సెమీస్ ఆశ‌లు సజీవంగా ఉంటాయి కాబట్టి. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న భార‌త్ ఆదివారం ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌బోతోంది.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే కోహ్లీసేన సెమీస్‌కు చేరడమే కాదు పాకిస్థాన్ సెమీస్ ఆశలను కూడా సజీవంగా ఉంచుతుంది. టోర్నలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తన తదుపరి మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ రెండు జట్లు టోర్నీలో అద్భుత విజయాలను నమోదు చేశాయి.

టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా సెమీస్ దిశగా అడుగులు వేస్తుంటే, కివీస్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే ఓడింది. మరోవైపు ఇంగ్లాండ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఈ రెండు జట్లను ఎలా ఎదుర్కొంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది.

సొంత గడ్డపై తొలిసారి టైటిల్ గెలవాలన్న ఇంగ్లాండ్ కల ఈసారైనా నెరవేరుతుందో లేదో చూడాలి మరి. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన ఇంగ్లాండ్ జట్టు 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ కూడా చెరో ఏడు మ్యాచ్‌లు ఆడి, చెరో 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Story first published: Saturday, June 29, 2019, 17:34 [IST]
Other articles published on Jun 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X