న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చీరకట్టులో క్రికెట్ ఆడిన మిథాలీ రాజ్.. !! (వైరల్ వీడియో)

Watch: Mithali Raj Inspires India Women By Playing Cricket In Saree Ahead Of T20 WC Final

ముంబై: 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌.. ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు.! ఎదుర్కోని ఆటుపోట్లు లేవు. పడని కష్టం లేదు.! పురుషుల క్రికెట్‌ నీడలో ఎదిగి దిగ్గజంగా మారింది.! భారత మహిళా క్రికెట్‌కు ప్రతీరూపంగా నిలిచింది.! ఎంత సేపు పురుషుల క్రికెట్‌నే ఆరాధ్యంగా భావించే అభిమానులను తన ఆటతో తమ వైపు తిప్పుకుంది.! కట్టుబాట్లను దాటి అమ్మాయిల ఆటకు దశ, దిశ చూపించింది.! అవకాశం వస్తే .. మెరుపులు కురిపిస్తారని చాటి చెప్పింది.! ఖేల్‌ రత్న, పద్మశ్రీ పురస్కారాలను అందుకుంది. ఆమె ఎవరో కాదు.. భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్..!

చీరకట్టులో..

తాజాగా ఆమె చీరకట్టుకొని క్రికెట్‌ ఆడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. సాధారణంగా క్రికెట్‌ అంటే జెర్సీ, ప్యాంటు ధరించి ఆడతారని అందరికీ తెలుసు. కానీ మిథాలీ చీర కట్టుకొని ఎందుకాడిందంటే.. కట్టుబాట్లను తెంచుకొని అమ్మాయిలు ఎదుగుతున్నారనేందుకు నిదర్శనంగా ఆమె ఇలా మైదానంలోకి దిగింది.

భారత అమ్మాయిలకు మద్దతుగా..

భారత అమ్మాయిలకు మద్దతుగా..

మార్చి 8న అంతర్జాతీయ మహిళల దినోత్సవం. అదే రోజున మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో హర్మన్‌ప్రీత్‌ సేన టీ20 ప్రపంచకప్‌ ఫైన ఆడనుంది. తొలిసారిగా భారత జట్టు ఫైనల్‌ చేరుకుంది. ఈ సందర్భంగా మిథాలీతో ఓ ప్రత్యేక వీడియో రూపొందించారు. 'టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ను స్వదేశానికి తీసుకురా' అనే సందేశాన్ని జోడించారు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా షేర్ చేసింది.

అయ్యో..ఇంగ్లండ్..

అయ్యో..ఇంగ్లండ్..

ఇక భారత అమ్మాయిల విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మిథాలీ రాజ్.. ఓ క్రికెటర్‌గా ఇంగ్లండ్ జట్టును చూస్తే జాలేస్తుందని తెలిపింది. ‘ఓ భారతీయురాలిగా మన అమ్మాయిల జట్టు ఫైనల్‌కు చేరడం సంతోషంగా ఉంది. కానీ ఓ క్రికెటర్‌గా మాత్రం ఇంగ్లండ్ జట్టుకు వచ్చిన పరిస్థితి మాత్రం ఎవరికి రావద్దని భావిస్తున్నా. కానీ ఏం చేస్తాం.. నిబంధనలు అలాంటివి. ఏమైనా అద్భుత విజయాలతో ఫైనల్‌కు చేరిన భారత అమ్మాయిలకు నా అభినందనలు'అని మిథాలీ ట్వీట్ చేసింది.

ఇంగ్లండ్ పాపం పండింది.. భారత్ ఫైనల్ చేరింది..!!

Story first published: Thursday, March 5, 2020, 21:17 [IST]
Other articles published on Mar 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X