న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్ఫూర్తిదాయక వీడియో: సచిన్ షేర్ చేయడంపై మద్దా రామ్ ఏమన్నాడో తెలుసా?

Watch: Meet Madda Ram Kawasi, a kid of Maoist affected Dantevada who is inspiration for Sachin Tendulkar

హైదరాబాద్: నూతన సంవత్సరం రోజున క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సచిన్ పోస్టు చేసిన వీడియోలో మద్దా రామ్‌ అనే 13 ఏళ్ల చిన్నారి నేలపై పాకుతూనే క్రికెట్‌ ఆడుతున్నాడు.

దంతేవాడ జిల్లాలోనే కోటేకల్యాన్ అనే చిన్న గ్రామంలో కాళ్ల చచ్చుబడ్డ మద్దారామ్‌‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఇష్టం. క్రికెట్‌పై తనకున్న ప్రేమకు అతడి అంగవైకల్యం అడ్డు రాలేదు. తన స్నేహితులతో కలిసి పాకుతూనే పరుగులు తీశాడు. ఆ చిన్నారి మానసిక స్థైర్యానికి ముగ్ధుడైన సచిన్ వీడియోని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

ఇంగ్లండ్‌కు పీటర్సన్‌ సలహా.. గెలవాలంటే ఆ ఇదర్దిలో ఒకరిని పక్కనపెట్టండి!!ఇంగ్లండ్‌కు పీటర్సన్‌ సలహా.. గెలవాలంటే ఆ ఇదర్దిలో ఒకరిని పక్కనపెట్టండి!!

స్ఫూర్తిదాయకమైన వీడియోతో

"ఈ స్ఫూర్తిదాయకమైన వీడియోతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి. ఈ వీడియో నన్ను ఎంతో కదలించింది. మీలోను అదే భావన కలిగిస్తుందని ఆశిస్తున్నా" అంటూ సచిన్ ట్వీట్ చేయడంతో ఈ వీడియోకు పెద్ద ఎత్తున షేర్లు, లైకులు వచ్చాయి. స్వయంగా క్రికెట్ గాడ్ సచినే తన వీడియోని షేర్ చేయడంతో ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

చిన్నారి మాట్లాడుతూ

చిన్నారి మాట్లాడుతూ

దీనిపై ఆ చిన్నారి మాట్లాడుతూ "నా క్రికెట్‌ దేవుడు సచిన్‌కు థాంక్స్‌. నాకు సచిన్‌ సారే స్ఫూర్తి. నా వీడియోను స్వయంగా ఆయన షేర్‌ చేసినందుకు చాలా ఆనంద పడటమే కాదు. గర్వంగా ఫీలవుతున్నా. మా ఊరికి రావాలని సచిన్‌ను కోరుతున్నా" అని ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు.

'టోక్యో ఒలింపిక్స్‌ ఫైనల్‌‌కు భారత్ చేరుతుందని నేను నమ్ముతున్నా'

క్రికెట్ ఆడేందుకు ప్రోత్సహిస్తారు

క్రికెట్ ఆడేందుకు ప్రోత్సహిస్తారు

తన స్నేహితుడు కోసా, రాజాలు ఎల్లప్పుడూ తనకు క్రికెట్ ఆడటంలో సహాయం చేయడంతో పాటు వారితో కలిసి ఆడేందుకు ప్రోత్సహిస్తారని మద్దా రామ్ తెలిపాడు. కోటేకల్యాన్ గ్రామానికి చెందిన అతని స్నేహితుల్లో ఒకరైన గోలు ఈ వీడియోను తన తండ్రి మొబైల్ ఫోన్ నుండి చిత్రీకరించడం జరిగింది.

డాక్టర్‌ కావాలనేదే తన జీవిత లక్ష్యం

డాక్టర్‌ కావాలనేదే తన జీవిత లక్ష్యం

ఇంకా మద్దా రామ్‌ మాట్లాడుతూ డాక్టర్‌ కావాలనేదే తన జీవిత లక్ష్యమని చెప్పుకొచ్చాడు. మద్దా రామ్ ఒక్కసారి స్టార్ అవడంతో ఆ ఏరాయా బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, గోపాల్ పాండే గురువారం మద్దా రామ్ చదువుకునే పాఠశాలకు వెళ్లి అతడిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మనందరికీ గర్వకారణం అని చెప్పారు. అంతేకాదు డిపార్ట్‌మెంట్‌ తరుపున నుంచి అతడికి క్రికెట్‌ కిట్‌ను కూడా అందించారు.

Story first published: Thursday, January 2, 2020, 14:55 [IST]
Other articles published on Jan 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X