న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'టోక్యో ఒలింపిక్స్‌ ఫైనల్‌‌కు భారత్ చేరుతుందని నేను నమ్ముతున్నా'

I believe India can play the final of Tokyo Olympics: Hockey captain Manpreet Singh

హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు వెళ్లే సామర్ధ్యం భారత పురుషుల హాకీ జట్టుకు ఉందని కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. 2018లో స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్ ఓటమిపాలై నిరాశపరిచిన తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన కొత్త కోచ్‌ గ్రహమ్‌ రీడ్‌ ఆధ్వర్యంలో గతేడాది నిలకడైన ప్రదర్శన చేసిన జట్టు టోక్యో ఒలింపిక్స్‌ అర్హత సాధించింది.

గత సంవత్సరాన్ని సమీక్షిస్తూ పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ"వెనక్కి తిరిగి చూస్తే, 2019 గొప్పగా సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంతో గతేడాదిని మొదలెట్టి.. నిలకడగా రాణించి అదే స్థానంతో ముగించాం. కొత్త కోచ్ ఆధ్వర్యంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యాన్ని అందుకున్నాం" అన్నాడు.

<strong>కంగ్రాట్స్‌ హార్దిక్‌.. వాటే ప్లెజెంట్‌ సర్‌ప్రైజ్‌: కోహ్లీ</strong>కంగ్రాట్స్‌ హార్దిక్‌.. వాటే ప్లెజెంట్‌ సర్‌ప్రైజ్‌: కోహ్లీ

టోక్యో ఒలింపిక్స్ పైనల్స్‌కు చేరుకోవడమే

టోక్యో ఒలింపిక్స్ పైనల్స్‌కు చేరుకోవడమే

"2020లో మా ముందున్న ప్రధాన లక్ష్యం టోక్యో ఒలింపిక్స్ పైనల్స్‌కు చేరుకోవడమే. నన్ను నమ్మండి.. తుదిపోరుకు చేరడం సాధ్యమే. గతేడాది ర్యాంకింగ్స్‌లో 5వ స్థానాన్ని నిలబెట్టుకున్నాం. దాని కోసం 2019లో నిలకడ ప్రదర్శన చేశాం. ఒలింపిక్స్‌లోనూ అదే జోరు కొనసాగిస్తుందనే నమ్మకం ఉంది. అలా జరగాలంటే నిలకడగా రాణించాలి" అని మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు.

యువ ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో

యువ ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో

"గతేడాది పలువురు యువ ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసి సత్తాచాటారు. యువ ఆటగాళ్లు అలా రాణించడం గొప్ప సానుకూలాంశం. రాబోయే ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో నెదర్లాండ్స్‌, బెల్జియం, ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్లను భారత్‌ ఢీకొట్టనుంది" అని చెప్పుకొచ్చాడు.

ఇది మాకు అతిపెద్ద సానుకూలత

ఇది మాకు అతిపెద్ద సానుకూలత

"ఆయా జట్లపై ప్రదర్శన ఆధారంగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు స్థానంపై ఓ అంచనాకు వస్తాం. ఇది మాకు అతిపెద్ద సానుకూలత. ముఖ్యంగా ఈ ఏడాది ఒలింపిక్స్‌తో పాటు ఎఫ్‌ఐహెచ్‌ ప్రో లీగ్‌లో మేము పోటీపడతాం. ఒలింపిక్స్‌ సన్నాహకం దిశగా ఈ టోర్నీతో మొదటి అడుగు వేయనున్నాం" అని మన్‌ప్రీత్‌ తెలిపాడు.

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భారత షెడ్యూల్ ఇదీ

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భారత షెడ్యూల్ ఇదీ

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భాగంగా భారత పురుషుల హాకీ జట్టు జనవరి 18, 19 తేదీల్లో నెదర్లాండ్స్‌తో.. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో బెల్జియంతో.. 22, 23 తేదీల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Story first published: Thursday, January 2, 2020, 13:19 [IST]
Other articles published on Jan 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X