న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీపై ఆసీస్ మీడియా విమర్శలు, చురకలంటిస్తోన్న నెటిజన్లు (వీడియో)

England VS India : Australia Media Comments On Kohli
Watch: Aussie media trolls Virat Kohli with favourite shot in England jibe over outside-of dismissals

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. అలాంటప్పుడు విమర్శలు మాత్రం ఎందుకు తగ్గుతాయి. ఎప్పటివో మ్యాచ్ ఫలితాలను ప్రస్తావిస్తూ.. కోహ్లీపై విమర్శలు గుప్పిస్తుంది ఆసీస్ మీడియా. సరిగ్గా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ముందే ఇలా చేయడం చర్చనీయాంశమైంది. ఈ ప్రయత్నాలను భారత అభిమానులు తిప్పికొడుతున్నారు.

1
42374

ఇంగ్లాండ్‌ గడ్డపై కోహ్లి ఫేవరేట్‌ షాట్‌

‘ఫాక్స్‌ స్పోర్ట్స్‌ ఆస్ట్రేలియా' తన ఫేస్‌బుక్‌ పేజీలో కోహ్లిపై ప్రత్యేకంగా రూపొందించిన ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఇందులో గత ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లి వైఫల్యాలను జతపరిచింది. అంతేకాకుండా ఈ వీడియోకు ‘ఇంగ్లాండ్‌ గడ్డపై విరాట్‌ కోహ్లి ఫేవరేట్‌ షాట్‌' అని సెటైరిక్‌ క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసింది.

భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం

భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం

ప్రస్తుతం ఈ వీడియోపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్‌ గడ్డపై కోహ్లి సాధించిన సెంచరీలు మరిచిపోయారా? అంటూ చురకలంటిస్తున్నారు. ఆసీస్‌ మీడియా కోహ్లీని టార్గెట్ చేయడం ఇదే తొలిసారేం కాదు. భారత పర్యటనలో భాగంగా డక్‌వర్త్‌ లూయిస్‌ విషయంలో స్మిత్‌ చేసిన పొరపాటును కప్పిపుచ్చుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో కోహ్లిని పోల్చుతూ విమర్శలు గుప్పించింది.

దారుణంగా విఫలమైన కోహ్లీ:

దారుణంగా విఫలమైన కోహ్లీ:

2014 ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్‌ 13.40 కాగా.. రెండు సార్లు డకౌట్‌ కూడా అయ్యాడు. ఈ సిరీస్‌ అనంతరం కోహ్లి నేలకు కొట్టిన బంతిలా విజృంభించాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుస సెంచరీలతో చెలరేగాడు.. ఇప్పటి వరకు ఆసీస్‌ గడ్డపై మొత్తం 8 మ్యాచ్‌లాడిన కోహ్లి 62 సగటుతో 992 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండటం విశేషం.

ఇంగ్లాండ్‌లో విఫలమవ్వడం కోహ్లికి వెలితి:

ఇంగ్లాండ్‌లో విఫలమవ్వడం కోహ్లికి వెలితి:

అనంతరం దక్షిణాఫ్రికా గడ్డపై 5 మ్యాచుల్లో 55.80 సగటుతో 558 పరుగులు చేశాడు. ఈ పర్యటనలో రెండు సెంచరీలు నమోదు చేశాడు. న్యూజిలాండ్‌ గడ్డపై రెండు మ్యాచుల్లో ఓ సెంచరీతో 214 పరుగులు చేశాడు. ఇలా అన్ని దేశాల మీద రాణించిన కోహ్లికి ఇంగ్లాండ్‌లో విఫలమవ్వడం వెలితిగా మిగిలిపోయింది. తన కెప్టెన్సీలో బుధవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే 5 టెస్టుల సిరీస్‌లో చెలరేగాలని కోహ్లి భావిస్తున్నాడు.

Story first published: Wednesday, August 1, 2018, 13:16 [IST]
Other articles published on Aug 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X