న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా‌లో ఆల్‌రౌండర్ల కొరతకు కారణం ఇదే: వసీం జాఫర్

Wasim Jaffer gives valid reasons for Sanju Samsons exclusion from India XI

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సత్తా చాటుతున్న టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోవడం లేదు. అప్పుడెప్పుడో ధోనీ హయాంలో విశ్వ విజేతగా నిలిచిన భారత్ జట్టు.. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు. ఈ కారణంగానే విరాట్ కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి.. రోహిత్ శర్మకు అప్పగించినా ఫలితం రాలేదు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లోనూ టీమిండియా సెమీస్ ధాటలేదు. అయితే టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం జట్టులో ఎక్కువగా ఆల్‌రౌండర్లు లేకపోవడమేననేది విశ్లేషకుల మాట. 10వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వరుసగా టీ20 ప్రపంచకప్‌లు కైవసం చేసుకున్నాయని, మిగతా జట్లు ఈ ట్రిక్ తెలుసుకోక విఫలమవుతున్నాయనేది వారి వాదన.

బౌలింగ్ ఆప్షన్స్ లేక..

ఇక విరాట్ కోహ్లీ హయాంలో కేవలం ఫైవ్ బౌలింగ్ ఆఫ్షన్స్‌తో ఆడిన టీమిండియా మూల్యం చెల్లించుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో ఆరుగురు బౌలర్ల ఆప్షన్ ఉన్నా.. రోహిత్ అంతగా వాడుకోలేదు. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో హార్దిక్ పాండ్యా సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్‌తో సిరీస్ విజయాన్నందించాడు. ఇదే పర్యటనలో శిఖర్ ధావన్ ఐదుగురు బౌలర్లు బరిలోకి దిగి 307 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక మూల్యం చెల్లించుకున్నాడు. తప్పు తెలుసుకున్న ధావన్.. రెండో వన్డేలో సంజూ శాంసన్‌కు బదులు బౌలింగ్ చేయగల దీపక్ హుడాతో బరిలోకి దిగాడు. తొలి వన్డే‌లో రాణించిన సంజూను పక్కన పెట్టడాన్ని అభిమానులు తప్పుబట్టారు. అయితే సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడానికి గల ప్రధాన కారణం జట్టులో అంతగా బౌలింగ్ ఆప్షన్స్ లేకపోవడమేనని వసీం జాఫర్ తెలిపాడు.

అందుకే సంజూను పక్కనపెట్టారు..

అందుకే సంజూను పక్కనపెట్టారు..

అయితే భారత జట్టులో ఆల్‌రౌండర్ల కొరతకు రెండు ప్రధాన కారణాలనున్నాయని ట్విటర్ వేదికగా వసీం జాఫర్ వెల్లడించాడు. 'అద్భుత ప్రదర్శన కనబర్చిన తర్వాత కూడా సంజూ శాంసన్ పక్కనపెట్టడానికి కారణం ఆల్‌రౌండర్స్, పార్ట్ టైమ్ బౌలింగ్ ఆప్షన్స్ లేకపోవడం. నా అభిప్రాయం ప్రకారం భారత్‌కు ఈ కొరత ఏర్పడటానికి రెండు కారణాలున్నాయి.

1. ఆల్‌రౌండర్ల కొరత: భారత జట్టు ఆల్‌రౌండర్లను సరిగ్గా మ్యానేజ్ చేయలేదు. ఆల్‌రౌండర్లకు తగినన్ని అవకాశాలు ఇచ్చి వారు కుదురుకునే పనిచేయలేదు. ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో విఫలమయితే పక్కనపెట్టేసాం. విజయ్ శంకర్, వెంకటేశ్ అయ్యర్, శివమ్ దూబే, కృనాల్ పాండ్యా ఇలా వచ్చి అలా వెళ్లినవారే. ఆల్‌రౌండర్ల విషయంలో కాస్త సహనం పాటించాల్సిన అవసరం ఉంది.

మిషిన్ల రాకతో..

మిషిన్ల రాకతో..

2. పార్ట్ టైమ్ బౌలర్ల కొరత: బౌలింగ్ మిషిన్స్, త్రో డౌన్ స్పెషలిస్ట్‌లు రావడంతో బ్యాటర్లు నెట్స్‌లో బౌలింగ్ చేయాల్సిన పరిస్థితే లేకుండా పోయింది. దాంతో పార్ట్‌టైమ్ బౌలర్ల కొరత ఏర్పడింది.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ పార్ట్ టైమ్ బౌలర్లుగా రాణించారు. కీలక సమయంలో వికెట్ తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

Story first published: Sunday, November 27, 2022, 18:00 [IST]
Other articles published on Nov 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X