న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా కొడుకు సెంచరీకి ఒక్కరు అండగా నిలబడలేదు.. గెలుపు మంగిట ఉంటే ఇలానే ఔటయ్యేవారా?

Washington Sundar’s father says Disappointed with the tail-enders after his son missed a century against England
IND VS ENG : Washington Sundar 96* Misses Maiden Test Century - Siraj & Ishant Failed To Support

చెన్నై: ఇంగ్లండ్‌తో శనివారం ముగిసిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా టెయిలెండర్లు కనీసం క్రీజులో నిలవలేకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌ తండ్రి ఎం సుందర్‌ అన్నాడు. జట్టు గెలుపు ముంగిట ఉంటే ఇలానే ఆడేవారా? అని ప్రశ్నించాడు. మొతేరా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు 294/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా చివరకు 365 పరుగులకు ఆలౌటైంది.

జస్ట్ మిస్..

జస్ట్ మిస్..

అక్షర్‌ పటేల్‌(97 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43), వాషింగ్టన్‌ సుందర్‌( 174 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 96 నాటౌట్) రాణించి ఏడో వికెట్‌కు శతకం భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే సుందర్‌ తొలి టెస్టు సెంచరీకి చేరువైన వేళ అక్షర్‌ పటేల్‌ రనౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాంత్‌(0), మహ్మద్‌ సిరాజ్‌(0) సైతం వెనువెంటనే ఔటవ్వడంతో సెంచరీ చేసుకునే సువర్ణవకాశాన్ని సుందర్‌ కోల్పోయాడు.

గెలుపు ముంగిట ఇలానే చేస్తారా?

గెలుపు ముంగిట ఇలానే చేస్తారా?

ఇదే విషయంపై ఓ నేషనల్ చానెల్‌తో మాట్లాడిన వాషింగ్టన్‌ తండ్రి.. తన కుమారుడు సెంచరీకి చేరువలో ఉండగా, టెయిలెండర్లు వికెట్లు పారేసుకోవడం బాధ కలిగించిందని తెలిపాడు. ' మన టెయిలెండర్ల పట్ల నేను చాలా నిరాశకు గురయ్యాను. కొద్దిసేపు కూడా వాళ్లు క్రీజులో నిలబడలేకపోయారు. ఒకవేళ టీమిండియా విజయానికి 10 పరుగులు అవసరమైన వేళ ఇలా వికెట్లు కోల్పోతే ఎలా ఉంటుంది? ఇది చాలా తప్పిదం కాదా?' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పాపం సుంధర్..

పాపం సుంధర్..

ఈ మ్యాచ్‌ను ఎంతో మంది యువ క్రికెటర్లు చూస్తరని.. ఈ టెయిలెండర్ల ఆట చూసి వాళ్లు అలా నేర్చుకోవద్దని సుందర్‌ తండ్రి చెప్పుకొచ్చారు. 'ఆ పరిస్థితిలో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు టెక్నిక్‌, నైపుణ్యాలు అవసరం లేదు. అక్కడ ధైర్యంగా నిలబడటం ఒక్కటే కావాలి.'అని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా, ఇదే సిరీస్‌లో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ వాషింగ్టన్‌ (85 నాటౌట్) పరుగులతో నిలిచి శతకాన్ని చేరుకోలేకపోయాడు. అప్పుడు కూడా టెయిలెండర్లు త్వరగా ఔటవ్వడంతో ఈ యువ ఆల్‌రౌండర్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

అద్భుత విజయం..

అద్భుత విజయం..

తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలింది. కేవలం 54.5 ఓవర్లలోనే ఆ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. డాన్‌ లారెన్స్‌ (95 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా అంతా విఫలయ్యారు. అశ్విన్‌ (5/47), అక్షర్‌ పటేల్‌ (5/48) పోటీ పడి ఐదేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్‌ సుందర్‌ (174 బంతుల్లో 96 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. అశ్విన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'.... పంత్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' పురస్కారాలు లభించాయి.

Story first published: Sunday, March 7, 2021, 17:50 [IST]
Other articles published on Mar 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X