ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన ధావన్-వార్నర్ జోడీ

Posted By:

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్‌ల జోడీ అరుదైన రికార్డుని నెలకొల్పింది. టీ20 క్రికెట్‌లో 2000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడీగా చరిత్ర సృష్టించారు. టీ20 ఫార్మెట్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం.

సొంతగడ్డపై ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరూ కలిసి ఆరో సారి తొలి వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా టీ20 ఫార్మెట్‌లో 2000 మైలురాయిని కూడా అధిగమించారు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ఆరుసార్లు 100 పరుగులు సాధించిన ఓపెనింగ్ జోడీ కూడా వీరిద్దరే కావడం విశేషం.

దీంతో పాటు కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. ఉప్పల్‌ స్టేడియంలో 1000 పరుగులు చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ ఈ రికార్డు సాధించాడు. కౌల్టర్‌-నైల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ నాలుగో బంతిని బౌండరీ బాదడంతో వార్నర్ ఈ ఘనత సాధించాడు.

Warner, Dhawan 1st to add 2,000 runs for any wicket in T20s

మరోవైపు ఈ మ్యాచ్‌లో 59 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 126 పరుగులు చేసిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఐదో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఈ స్థానంలో నిలిచాడు.

పదేళ్ల ఐపీఎల్: 10 వేగవంతమైన సెంచరీలు, టాప్‌లో గేల్

క్రిస్ గేల్ (30), యూసుఫ్ పఠాన్ (37), డేవిడ్ మిల్లర్ (38), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (42) ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన తొలి నలుగురు ఆటగాళ్లు కాగా వార్నర్, ఏబీ డివిలియర్స్ ఐదో స్థానంలో ఉన్నారు.

Story first published: Tuesday, May 2, 2017, 19:45 [IST]
Other articles published on May 2, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి