న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్ వేదికగా గొడవకు దిగిన ఇషాంత్.. జడేజాలు(వీడియో)

War of Words: Ishant-Jadeja Fight With Eachother on-Field

పెర్త్: ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టు వివాదాలతో ముగిసింది. ఇరు జట్ల కెప్టెన్లు వాగ్వాదానికి దిగడంతో అంపైర్ వారి మధ్య సంధి కుదిర్చాడు. దీంతో పాటు జరిగిన మరో వివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ పెద్ద ఎత్తున గొడవపడిన ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆటలో నాలుగోరోజైన సోమవారం ఫీల్డింగ్‌ కూర్పులో భాగంగా తలెత్తిన వివాదం.. తారాస్థాయికి చేరడంతో ఒకానొక దశలో జడేజాపైకి దూసుకెళ్లిన ఇషాంత్ శర్మ.. చేయి చేసుకునేంత ఆవేశంలో కనిపించాడు.

వారిని విడదీసి సర్దిచెప్పిన భువీ, షమీ

వారిని విడదీసి సర్దిచెప్పిన భువీ, షమీ

అక్కడికి చేరుకున్న మరో ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ షమీ, డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ వారిని విడదీసి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కానీ.. ఈ వీడియో మంగళవారం వెలుగులోకి రావడంతో.. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ పరువు తీశారంటూ అభిమానులు మండిపడుతున్నారు.

జడేజా రెండో టెస్టులో ఎలా

జడేజా రెండో టెస్టులో ఎలా

అసలు పెర్త్ టెస్టు తుది జట్టులో లేని జడేజా మైదానంలో ఎందుకు ఉన్నాడంటే.. వాస్తవానికి పెర్త్ టెస్టు తుది జట్టులో రవీంద్ర జడేజా లేడు. కానీ.. సోమవారం మ్యాచ్ మధ్యలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. బౌలింగ్ చేస్తున్న ఇషాంత్ శర్మకి లాంగాన్, లాంగాఫ్‌లో ఫీల్డర్ల కూర్పుపై సలహాలిచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో.. అప్పటికే విసుగుచెంది ఉన్న ఇషాంత్ శర్మ అతడిపై నోరుజారాడు.

జడేజాపైకి దూసుకెళ్లిన ఇషాంత్ శర్మ

జడేజా కూడా అదేరీతిలో ప్రతిఘటించగా.. సహనం కోల్పోయిన ఇషాంత్ శర్మ.. అతడిపైకి దూసుకెళ్లాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. ఇషాంత్ శర్మ తొలి టెస్టు నుంచి రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ వరకూ నోబాల్ ఒత్తిడి కారణంగా సతమతమవుతున్నాడు. ఈ కారణం చేత లయ తప్పడంతో.. అతడ్ని లక్ష్యంగా చేసుకుని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించే పని పెట్టుకున్నారు. సరిగ్గా అదే సమయంలో జడేజా సలహాలివ్వడం అతనికి కోపానికి ఓ కారణమై ఉండొచ్చు.

తొలి టెస్టులో భారత్-రెండో టెస్టులో ఆసీస్

తొలి టెస్టులో భారత్-రెండో టెస్టులో ఆసీస్

మ్యాచ్‌లో 287 పరుగుల భారీ లక్ష్య ఛేదనకి దిగిన భారత్ జట్టు 140 పరుగులకే ఈరోజు కుప్పకూలిపోయింది. దీంతో.. 146 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టుల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, December 18, 2018, 14:06 [IST]
Other articles published on Dec 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X