న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'వైజాగ్ మ్యాచ్‌లో టీమిండియా కుల్దీప్‌ని ఆడిస్తుందేమో'

Vizag pitch could force India to play Kuldeep Yadav: Sunil Gavaskar

వైజాగ్: వెస్టిండీస్‌తో విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని భారత్ జట్టు ఆడించే అవకాశం ఉందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ టెస్టు సిరీస్ ముగించుకుని రెండో వన్డే ఆడేందుకు సిద్దమైపోయింది. ఈ క్రమంలో తొలి వన్డే మాదిరి రెండో వన్డే కూడా మ్యాచ్‌కు ముందే భారత జట్టును ప్రకటించేసింది బీసీసీఐ.

స్పిన్నర్లకి అనుకూలమైన వైజాగ్ పిచ్

స్పిన్నర్లకి అనుకూలమైన వైజాగ్ పిచ్

ఇందులో తొలి వన్డే ఆడిన జట్టుతో పాటు అదనంగా కుల్దీప్ పేరును జోడించింది. దీనికితోడు విశాఖపట్నం పిచ్ స్పిన్నర్లకి అనుకూలించనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కుల్దీప్ యాదవ్‌కి బుధవారం తుది జట్టులో చోటు దక్కవచ్చని గవాస్కర్ వెల్లడించాడు.

హెట్‌మెయర్‌ని ముప్పుతిప్పలు పెట్టిన కుల్దీప్

హెట్‌మెయర్‌ని ముప్పుతిప్పలు పెట్టిన కుల్దీప్

‘విశాఖ పిచ్‌ నుంచి స్పిన్నర్లకి ఎక్కువ సహకారం లభించనుంది. కాబట్టి.. గౌహతి వన్డేలో ఇబ్బంది పడిన బౌలర్లకి ఈ వన్డేలో కాస్త ఉపశమనం లభించొచ్చు. అయితే.. అలాంటి చేదు అనుభవాలు కూడా బౌలర్లకి మంచివే. వాటి నుంచి చాలా అంశాలు నేర్చుకోవచ్చు. గౌహతి వన్డేలో సెంచరీ బాదిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ హెట్‌మెయర్‌ని ఇటీవల టెస్టు సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ నేపథ్యంలో.. కుల్దీప్ యాదవ్‌ని భారత్ తుది జట్టులోకి తీసుకుంటుందేమో.' అని గవాస్కర్ వెల్లడించాడు.

ముగ్గురు పేసర్లతో 322 పరుగులనిచ్చి:

ముగ్గురు పేసర్లతో 322 పరుగులనిచ్చి:

గౌహతి వేదికగా ఆదివారం ముగిసిన తొలి వన్డేలో ఇద్దరు స్పిన్నర్లు (చాహల్, జడేజా), ముగ్గురు పేసర్లు(షమీ, ఉమేశ్, ఖలీల్)తో బరిలోకి దిగిన టీమిండియా.. 322 పరుగులని వెస్టిండీస్‌‌కి సమర్పించుకుంది. షమీ 10 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 81 పరుగులు ఇచ్చేశాడు. మరోవైపు మణికట్టు స్పిన్నర్ చాహల్ మాత్రం 10 ఓవర్లు వేసి 41 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

 8 వన్డేలాడి.. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడి

8 వన్డేలాడి.. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడి

ఇండోర్‌లో జరగాల్సిన భారత్‌-వెస్టిండీస్‌ రెండో వన్డే.. అనుకోని విధంగా విశాఖపట్నానికి తరలి వచ్చింది. దీంతో కొంత విరామం తర్వాత సాగర తీరంలో మళ్లీ క్రికెట్‌ సందడి చూడబోతున్నాం. దేశంలో భారత క్రికెట్‌ జట్టుకు బాగా కలిసొచ్చిన మైదానాల్లో విశాఖ మైదానం ఒకటి. ఇక్కడ మొత్తం టీమిండియా మొత్తం 8 వన్డేలాడగా.. అందులో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడింది.

Story first published: Wednesday, October 24, 2018, 13:25 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X