న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్‌తో టెస్ట్.. ఆరో బ్యాట్స్‌మన్‌గా విహారికి బదులు రోహిత్‌నే తీసుకొవాలి!!

Virender Sehwag wants India to play Rohit Sharma ahead of Hanuma Vihari at no.6

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరిగే టెస్టుల సిరీస్‌లో ఆరో బ్యాట్స్‌మన్‌గా హనుమ విహారి కంటే రోహిత్‌ శర్మనే తీసుకొవాలి. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలంటే సీనియర్‌ ఆటగాళ్లతోనే బరిలోకి దిగాలని భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం సర్ వివ్ రిచర్డ్స్ మైదానంలో భారత్-విండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియా తుది జట్టు కూర్పే పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ కీలక సూచనలు చేసాడు.

<strong>మంచి భార్య ఎప్పుడూ తన భర్త తప్పుల్ని క్షమిస్తుంది: సెహ్వాగ్‌</strong>మంచి భార్య ఎప్పుడూ తన భర్త తప్పుల్ని క్షమిస్తుంది: సెహ్వాగ్‌

విహారికి బదులు రోహిత్‌:

విహారికి బదులు రోహిత్‌:

తాజాగా సెహ్వాగ్‌ మాట్లాడుతూ... 'ఆరో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మనే సరైన ప్రత్యామ్యాయం. హనుమ విహారి కంటే రోహిత్‌ మంచి బ్యాట్స్‌మన్‌. ప్రస్తుతం అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. జట్టుకు అవసరమైతే భారీ షాట్లు కొట్టగలడు. గతంలో విహారి ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయడంతో పాటు కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేశాడు. విహారి కంటే రోహిత్‌ను తీసుకుంటేనే జట్టుకు మరింత ఉపయోగం' అని సెహ్వాగ్‌ అన్నాడు.

అశ్విన్‌ను తీసుకుంటేనే ఉత్తమం:

అశ్విన్‌ను తీసుకుంటేనే ఉత్తమం:

'ప్రస్తుతం టీమిండియా అత్యుత్తమ టెస్టు స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ ఒకడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టెస్టు క్రికెట్‌లో హర్భజన్‌ సింగ్‌ 417 వికెట్ల రికార్డును అశ్విన్‌ త్వరలోనే బ్రేక్‌ చేస్తాడు. విండీస్‌లో వికెట్‌ భారత్‌ తరహాలోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉండటంతో.. చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కంటే అశ్విన్‌ను తీసుకుంటేనే ఉత్తమం. అతడు బ్యాటింగ్ కూడా చేయగలడు' అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగితేనే మంచిదని సెహ్వాగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

'విండీస్‌పై ఐదుగురు బౌలర్లతో దిగితే రహానేకే అవకాశం ఇవ్వాలి'

ఐదుగురు బౌలర్లతో దిగితే:

ఐదుగురు బౌలర్లతో దిగితే:

తొలి టెస్టు ఫైనల్ ఎలెవన్ గురించి మాట్లాడుతూ... 'టెస్టుల్లో అంజిక్య రహానే నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు జట్టును ఆదుకుంటాడు. విండీస్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదుగురు బౌలర్లతో దిగితే రహానేకే అవకాశం ఇవ్వాలి. ఒకవేళ నలుగురు బౌలర్లైతేనే రోహిత్‌ శర్మకు జట్టులో స్థానం కల్పించాలి' అని సెహ్వాగ్‌ సూచించాడు.

Story first published: Thursday, August 22, 2019, 15:11 [IST]
Other articles published on Aug 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X