For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రహానేకే అవకాశం ఇవ్వాలి: కోహ్లీకి సెహ్వాగ్ సూచన

Virender Sehwag Suggestion To Virat Kohli || Oneindia Telugu
If Virat kohli choose 5 bowlers, Ajinkya Rahane included for 1st Test vs West Indies

ఆంటిగ్వా: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత్.. టెస్టు సిరీస్‌ సమరానికి సిద్దమయింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం సర్ వివ్ రిచర్డ్స్ మైదానంలో భారత్-విండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తుది జట్టు కూర్పే పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ సూచన చేసాడు.

రహానేకే అవకాశం ఇవ్వాలి:

రహానేకే అవకాశం ఇవ్వాలి:

తొలి టెస్టు ఫైనల్ ఎలెవన్ గురించి సెహ్వాగ్‌ మాట్లాడుతూ... 'టెస్టుల్లో అంజిక్య రహానే నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు జట్టును ఆదుకుంటాడు. విండీస్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదుగురు బౌలర్లతో దిగితే రహానేకే అవకాశం ఇవ్వాలి. ఒకవేళ నలుగురు బౌలర్లైతేనే రోహిత్‌ శర్మకు జట్టులో స్థానం కల్పించాలి' అని సెహ్వాగ్‌ సూచించాడు.

బ్యాటింగ్‌లో ముందుకు రావాల్సింది:

బ్యాటింగ్‌లో ముందుకు రావాల్సింది:

'న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీస్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే బాగుండేది. మహీ అనుభవజ్ఞుడు, పరిస్థితిని బట్టి బ్యాటింగ్ చేయగలడు కాబట్టి అతను బ్యాటింగ్‌లో ముందుకు రావాల్సి ఉండే. హార్దిక్ పాండ్యా పెద్ద షాట్లు ఆడే ఆటగాడు కాబట్టి డెత్ ఓవర్లలో ఏడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తే ఫలితం వేరేలా ఉండేది' అని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.

నిషేధం తగ్గినందుకు సంతోషం:

నిషేధం తగ్గినందుకు సంతోషం:

స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎస్.శ్రీశాంత్‌కు విధించిన జీవిత నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించడం పట్ల సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశాడు. 'శ్రీశాంత్‌పై నిషేధం ఏడేళ్లకు తగ్గినందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీశాంత్‌ దేళవాళీ క్రికెట్‌ ఆడాల్సిన అవసరం ఉంది. దేళవాళీ క్రికెట్‌ అతనికి ఉపయోగపడనుంది' అని వీరూ అన్నాడు.

ఫొటో వైరల్‌.. ఐలాండ్స్‌ బీచ్‌లో విరుష్క జంట

నిబంధన కష్టంగా ఉంది:

నిబంధన కష్టంగా ఉంది:

సెలక్టర్‌గా పనిచేయడం ఇష్టమేనా అన్న ప్రశ్నకు.. 'నేను కాలమ్స్‌ రాస్తాను. టీవీల్లో కనిపిస్తాను. సెలక్టర్‌ ఐతే ఎన్నో ఆంక్షలు ఉంటాయి. అన్ని ఆంక్షలు నేనిష్టపడతానో లేదో తెలీదు' అని వీరూ పేర్కొన్నాడు. '2017లో బీసీసీఐ కార్యదర్శి ఎంవీ శ్రీధర్‌ కోరడంతో కోచ్‌ పదవికి దరఖాస్తు చేశా. ఇప్పుడెవరూ అడగలేదు, చేయలేదు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన కష్టంగా ఉంది' అని వీరు చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, August 22, 2019, 14:17 [IST]
Other articles published on Aug 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+