న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో సెహ్వాగ్‌ వద్దు.. ధోని లేదా కోహ్లీ అయితే సంతోషిస్తా: కుమారులపై సంచలన వ్యాఖ్యలు

Virender Sehwag Wants His Sons To Bcome Like Virat Kohli Or MS Dhoni || Oneindia Telugu
Virender Sehwag Wants His Sons To Become Like Virat Kohli Or MS Dhoni

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు చూసిన అత్యుత్తమ ఓపెనర్లలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. భారతదేశం చూసిన అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీరేంద్ర సెహ్వాగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది అతడి విధ్వంసక శైలి బ్యాటింగ్‌ .

వీరేంద్ర సెహ్వాగ్ బరిలోకి దిగాడంటే బంతి బౌండరీకి వెళ్లాల్సిందే. అలాంటి డాషింగ్ ఓపెనర్ తన కుమారుల విషయంలో మాత్రం సంచనల వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్‌గా సెహ్వాగ్ సక్సెస్ అయినప్పటికీ తనలాగ తన కుమారులు మారాలని కోరుకోలేదు. తన ఇద్దరు కుమారులు ఆర్యవీర్ (12), వేదాంత్ (9)లు ధోని, కోహ్లీ, హార్దిక్ పాండ్యాలా అవ్వాలని కోరుకున్నాడు.

అశ్విన్, జడేజా రికార్డు బద్దలు: 10 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డుఅశ్విన్, జడేజా రికార్డు బద్దలు: 10 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు

సెహ్వాగ్ మాట్లాడుతూ

సెహ్వాగ్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ "నేను వారిలో మరొక వీరేంద్ర సెహ్వాగ్‌ను చూడాలనుకోవడం లేదు. వారు విరాట్ కోహ్లీ లేదా హార్దిక్ పాండ్యా లేదా ధోని కావచ్చు. వారు క్రికెటర్లు కానవసరం లేదు. వారు వారి వృత్తిని స్వేచ్ఛగా ఎన్నుకోవచ్చు. వాటిని సాధించడానికి మేము వారికి సహాయం చేస్తాం. బాటమ్ లైన్ ఏంటంటే వారు మంచి మనుషులగా ఉండటం. అది చర్చించలేనిది" అని అన్నారు.

ఒక పాఠశాలను నిర్మించాలని

ఒక పాఠశాలను నిర్మించాలని

విజయవంతమైన క్రికెటర్ అయిన తర్వాత పిల్లల కోసం ఒక పాఠశాలను నిర్మించాలని తన తండ్రి ఎలా కోరుకుంటున్నారో సెహ్వాగ్ ఈ సందర్భంగా వెల్లడించాడు. ప్రస్తుతం తాను ఓ ఉత్తమమైన పనిని అందించడానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపాడు.

నాకు క్రికెట్ ఇచ్చింది

నాకు క్రికెట్ ఇచ్చింది

"నా దగ్గర ఉన్నవన్నీ నాకు క్రికెట్ ఇచ్చింది. ఢిల్లీ లీగ్ సర్క్యూట్‌లో ఆడటం కోసం నేను ఎప్పుడైతే ప్రయత్నించానో... నేను పుట్టి పెరిగిన నజఫగర్ నుంచి కొన్ని గంటలు ప్రయాణించాను. క్రికెట్ నాకు రొట్టె మరియు వెన్నని ఇస్తూనే ఉంది. ఇప్పుడు నేను సమాజానికి తిరిగి ఇవ్వవలసిన సమయం వచ్చింది" అని సెహ్వాగ్ తెలిపాడు.

పిల్లలు చదువుకునేందుకు

పిల్లలు చదువుకునేందుకు

"'విజయవంతమైన క్రికెటర్‌గా మారిన తర్వాత పిల్లలు చదువుకునేందుకు బస చేసే, ఆడుకునే పాఠశాలను నిర్మించు'- మా నాన్న చెప్పిన సందేశం స్పష్టంగా ఉంది. నా ప్రారంభ జీవితంలో చాలా కష్టపడ్డాం. కానీ, ఇప్పుడు నేను నా తండ్రిని సంతోషపెట్టాలనుకుంటున్నాను" అని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

సంతోషంగా భావిస్తాను

సంతోషంగా భావిస్తాను

"నా అకాడమీలు మరియు పాఠశాలలో చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు. వారిలో కనీసం ఒకరో లేదా ఇద్దరు ఐఐటిలలో చేరి... ఫేమస్ డాక్టర్ లేదో టీమిండియాకు ఆడగలిగితే... నేను సమాజానికి కొంత సేవ చేసినట్లు భావిస్తాను. నేను ఎంతో సంతోషంగా భావిస్తాను" అని సెహ్వాగ్ తెలిపాడు.

Story first published: Thursday, November 28, 2019, 18:59 [IST]
Other articles published on Nov 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X