న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నన్ను ఓపెనర్‌గా ఆడించాలనే ఐడియా గంగూలీది కాదు.. ఎవరిదంటే?: వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag Reveals Who Suggested His Name To Ganguly For Openers Role

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతను సాధించిన ఘనతలను చూస్తేనే అతను ఎంతటి ప్రమాదకర బ్యాటరో అర్థమవుతోంది. ప్రత్యర్ధి బౌలర్.. మ్యాచ్ పరిస్థితి వంటి విషయాలు సెహ్వాగ్ అక్కరకు లేదు. బంతి బాదడమే లక్ష్యంగా చెలరేగేవాడు. ధనాధన్ బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగెత్తించేవాడు. సచిన్‌, గంగూలీ అయినా కాస్త ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టేవాళ్లు.. కానీ, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం తొలి బంతి నుంచే విరుచుకుపడేవాడు.

ఓపెనర్‌గా ప్రమోట్ అవ్వడంతో..

ఓపెనర్‌గా ప్రమోట్ అవ్వడంతో..

మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌పై చెడుగుడు ఆడేవాడు.అది వన్డేనా..? టెస్ట్ మ్యాచ్‌ ఆడుతున్నామా అనే తేడా లేకుండా బౌలర్లపై విరుచుకుపడేవాడు. అలా టెస్టుల్లో రెండు ట్రిపుల్‌ సెంచరీలను నమోదు చేసిన సెహ్వాగ్ భారత తరఫున హయ్యెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. అయితే కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్‌లో ఆడిన సెహ్వాగ్.. ఓపెనర్‌గా ప్రమోట్ అవ్వడంతో సక్సెస్ సాధించాడు. అయితే అతన్ని ఓపెనింగ్ పంపించాలని ఐడియా ఇచ్చిన ఆటగాడు ఎవరు? అని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశ్నించగా సెహ్వాగ్ బదులిచ్చాడు.

గంగూలే అని..

గంగూలే అని..

ఇప్పటి వరకు చాలామంది అభిమానులు టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీనే సెహ్వాగ్‌ను ఓపెనర్‌గా పంపించాడని భావిస్తారు. అయితే.. గంగూలీ నాయకత్వంలోనే సెహ్వాగ్‌ ఓపెనర్‌గా వచ్చాడు. కానీ, తన పేరును మరొక కీలక ప్లేయర్‌ సూచించాడని తాజాగా సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ఓ క్రీడా ఛానల్‌లో పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌తో సెహ్వాగ్‌ ప్రత్యేక చిట్‌చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్‌ను అక్తర్‌''నిన్ను ఓపెనింగ్‌కు పంపించాలనేది ఎవరి ఐడియా?''.. ప్రశ్నించాడు.

జహీర్ సలహాతో..

జహీర్ సలహాతో..

దీనికి సమాధానంగా 'ఇన్నింగ్స్‌ను ప్రారంభించే స్థానంలో నన్ను దింపాలనేది అప్పటి టీమిండియా పేసర్‌ జహీర్‌ ఖాన్‌ ఐడియా. ఇదే విషయాన్ని కెప్టెన్‌గా ఉన్న సౌరవ్ గంగూలీకి చెప్పాడు. నేను అప్పటి వరకూ మిడిలార్డర్‌లోనే ఆడేవాడిని. అంతేకాకుండా తొలిసారి నిన్ను (షోయబ్‌) 1999లో మిడిలార్డర్‌ బ్యాటర్‌గానే ఎదుర్కొన్నా'' అని సెహ్వాగ్‌ వివరించాడు. ఇప్పుడు తెలిసింది కదా.. సెహ్వాగ్‌ వీరవిహారం వెనుక ఉన్న మాస్టర్‌ మైండ్‌.

Story first published: Friday, August 19, 2022, 13:10 [IST]
Other articles published on Aug 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X