న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంగూలీకి ఆ విషయం నేనే చెప్పా; వీరేంద్ర సెహ్వాగ్

By Nageshwara Rao
Virender Sehwag informed Sourav Ganguly about Greg Chappells mail to BCCI

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి వ్యతిరేకంగా అప్పటి కోచ్‌ గ్రేగ్‌ చాపెల్‌ బీసీసీఐకి మెయిల్‌ రాయడాన్ని దాదాకు చెప్పింది తానేనని మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తెలిపాడు. శుక్రవారం కోల్‌కతాలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సెహ్వాగ్ పాల్గొన్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ 'కడుపు నొప్పిగా ఉందని అంపైర్స్‌కు చెప్పి నేను ఫీల్డీంగ్‌ చేయకుండా మైదానం వీడాను. ఐదు ఓవర్లు విశ్రాంతి కావాలని కోరాను. నేను వెళ్లి గ్రేగ్‌చాపెల్‌ (అప్పటి టీమిండియా హెడ్‌ కోచ్‌) వెనుకాల కూర్చున్నాను. ఆ సమయంలో గ్రేగ్‌.. గంగూలీకి వ్యతిరేకంగా బీసీసీఐకి ఓ మెయిల్‌ రాయడం చూశాను. వెంటనే ఈ విషయాన్ని దాదాకు చెప్పాను' అని 2005 జింబాబ్వే పర్యటనలోని జరిగిన సంఘటనను సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.

తాను టెస్టు క్రికెట్ ఆడలేనని అన్నారు

తాను టెస్టు క్రికెట్ ఆడలేనని అన్నారు

ఆ రోజుల్లో తాను టెస్టు క్రికెట్ ఆడలేనని, కేవలం తెల్ల బంతితోనే రాణించగలనని అందరూ అన్నారని సెహ్వాగ్ తెలిపాడు. అయితే టెస్టుల్లో తాను తొలి సెంచరీ సాధించినప్పుడు గంగూలీ కౌగిలించుకొని.. టెస్టుల్లో ఆడే అవకాశం కల్పించాడని సెహ్వాగ్ చెప్పాడు. దీంతో తానెంటో నిరూపించాలనుకున్నానని సెహ్వాగ్ తెలిపాడు.

 అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ నమోదు చేసిన సెహ్వాగ్

అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ నమోదు చేసిన సెహ్వాగ్

దక్షిణాఫ్రికాపై 2001లో అరంగేట్ర మ్యాచ్‌లోనే సెహ్వాగ్‌(105) తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత టెస్టుల్లో భారత్ తరుపున రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా సెహ్వాగ్ నిలిచాడు. అంతేకాదు వన్డేల్లో సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగే అవకాశాన్ని కూడా దాదానే ఇచ్చాడని సెహ్వాగ్ చెప్పాడు.

 సచిన్‌తో కలిసి ఓపెనర్‌గా

సచిన్‌తో కలిసి ఓపెనర్‌గా

సచిన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాలని గంగూలీ, అప్పటి కోచ్‌ జాన్‌రైట్‌లు తనకు సూచించారని సెహ్వాగ్‌ తెలిపాడు. ‘సచిన్‌, గంగూలీలు ఉన్న తర్వాత నేనేందుకు అని వారిని ప్రశ్నించా. మిడిలార్డర్‌లో ఆడనివ్వండని కోరా. కానీ సౌరవ్‌, జాన్‌రైట్‌లు ఆ ఓపెనింగ్‌ స్థానం నీ కోసమేనని పట్టుబట్టి ఆడించారు' అని సెహ్వాగ్‌ తెలిపాడు.

2005లో టీమిండియా హెడ్ కోచ్‌గా గ్రెగ్ చాపెల్

2005లో టీమిండియా హెడ్ కోచ్‌గా గ్రెగ్ చాపెల్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ అయిన గ్రేగ్‌ చాపెల్‌ను బీసీసీఐ 2005లో భారత క్రికెట్‌ జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్నా గంగూలీకి, కోచ్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరి.. వివాదస్పదమైంది. చివరకు చాపెల్ కారణంగా గంగూలీ జట్టు నుంచి స్థానం కూడా కోల్పోయాడు.

 పంజాబ్ జట్టుకు మెంటార్‌గా సెహ్వాగ్

పంజాబ్ జట్టుకు మెంటార్‌గా సెహ్వాగ్

కాగా, ప్రస్తుతం సెహ్వాగ్ ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్‌లో కొత్తగా సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న దినేశ్‌ కార్తీక్‌, అశ్విన్‌లపై సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. దినేశ్‌ కార్తీక్‌ అన్ని ఫార్మాట్లలో తమిళనాడు కెప్టెన్‌గా వ్యవహరించాడని, అశ్విన్‌ చాలా స్మార్ట్‌ అని, బౌలర్‌గా మైదానంలోని పరిస్థితులను అర్థం చేసుకోగలడని సెహ్వాగ్ అన్నాడు.

Story first published: Saturday, April 21, 2018, 16:44 [IST]
Other articles published on Apr 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X