|
టీమిండియా జిమ్‌లోనే సాధన చేసి
ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సిన తరుణంలో వర్షం ఆటంకం కావడంతో టీమిండియా జిమ్‌లోనే సాధన చేసింది. ఆ తర్వాత నెట్స్‌లో సాధన చేసిన కోహ్లీ అక్కడే ఉన్న అభిమానిని చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పూజారాలతో ప్రాక్టీస్ కిట్ తీసుకుని తిరిగి వస్తున్నాడు కోహ్లీ. చాలాసేపటి నుంచి తనకోసం వేచిచూస్తున్న కెప్టెన్ కోహ్లీ రావడంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేవ్..
|
టీ షర్ట్ లోపల కూడా కావాలని
అతను అడిగాడని కోహ్లీ ఛాతిపై సంతకం చేశాడు. ఆ అభిమాని అక్కడితో ఆగకుండా టీ షర్ట్ లోపల కూడా చేయమన్నాడు. కోహ్లీ కాస్త ఇబ్బందిగా భావించి పేపర్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ అతను టీ షర్ట్ లోపల కూడా సంతకం చేయమని అడగడంతో.. దానిపై కూడా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత అతనితో పాటు వచ్చిన మరొకరితో ఫొటోకు ఫోజిచ్చాడు.
|
3 రోజులు పాటు జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్
టెస్టు ఫార్మాట్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌గా ఆడనున్న మ్యాచ్‌ను గురువారం నుంచి ఆరంభించింది. 3 రోజుల పాటు జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్ అంతకుముందు బీసీసీఐ విజ్ఞప్తి మేరకు నాలుగు రోజులుగా నిర్ణయించినా వర్షం ఆటంకంతో మళ్లీ మూడు రోజుల్లోనే ముగియనుంది. ఇలా ఆసీస్ గడ్డపై భారత్ టెస్టుల్లో ఎంతవరకూ రాణించగలదోననే సామర్థ్యాన్ని అంచనా వేసుకునే పనిలో పడింది భారత్.

పృథ్వీ షా, రిషబ్ పంత్, హనుమ విహారీతో బరిలోకి
టెస్టు ఫార్మాట్‌కు టీమిండియా యువ క్రికెటర్లు అయిన పృథ్వీ షా, రిషబ్ పంత్, హనుమ విహారీతో బరిలోకి దిగవచ్చు. అయితే వారందరికీ ఆసీస్ గడ్డపై ఇదే తొలి టెస్టు ఫార్మాట్. పృథ్వీ షా, పంత్‌లు గతంలో భారత్ తరపున ఆడి చక్కగా ఆకట్టుకున్నారు. ప్రస్తుత ఫార్మాట్‌కు ఆసీస్ మంచి ఫేస్ బలగంతో సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ సాధించుకోలేని భారత్ ఈ సారి మాత్రం దక్కించుకుని తీరాలనే పట్టుదలతో కనిపిస్తోంది.