న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. రిటైర్ అయ్యాకా ఇదే ఫిట్‌నెస్‌తో ఉంటాడా..?

Virat Kohli Wants To Keep Training Even After Retirement..? | Oneindia Telugu
Virat Kohli wants to keep training even after retirement, says fitness is a way of life

హైదరాబాద్: ప్రస్తుత క్రికెట్‌లో మిస్టర్ ఫిట్‌గా అందరి కంటే ముందుగా కోహ్లీనే ఉంటాడు. ఈ ఫిట్‌‍నెస్ కోసం పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయాడు. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే కాదు రిటైర్‌మెంట్ తర్వాత కూడా తన ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తానని చెప్పాడు. ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లలో వరుసగా మూడు సెంచరీలు నెలకొల్పి రికార్డు నెలకొల్పి సూపర్ ఫిట్‌నెస్‌తో కెరీర్ కొనసాగిస్తున్నాడు.

మ్యాచ్ మొదలుకావడానికి ముందే 10 పరుగులతో భారత్ మ్యాచ్ మొదలుకావడానికి ముందే 10 పరుగులతో భారత్

రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఇదే ఫిట్‌నెస్‌

రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఇదే ఫిట్‌నెస్‌

వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20 సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతి దొరకడంతో ప్రస్తుతం కుటుంబం, స్నేహితులతో గడుపుతున్నాడు. తరచూ వ్యక్తిగత ఇంటర్వూలలో ఫిట్‌నెస్ ప్రాముఖ్యం గురించి చెప్తుండే కోహ్లీ ఇండియా టుడేతో తాజాగా ముచ్చటించాడు. అతని కెరీర్‌లో ఫిట్‌నెస్ క్రీడలో ఎంత ప్రభావం చూపిందో వివరించాడు. ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా పేరుగాంచిన కోహ్లీ ఈ విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఈ క్రమంలోనే రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఇదే స్థాయి ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తానని చెప్పాడు.

నువ్వెంత చేయగలవోననేది ఫిట్‌నెస్ ద్వారానే

నువ్వెంత చేయగలవోననేది ఫిట్‌నెస్ ద్వారానే

ఫిట్‌గా, నిజాయతీగా ఉండటమే తనను క్రీడల్లో ఇంతటివాడిని చేసిందంటూ దానిని ఎప్పటికీ వదలనని కోహ్లీ తెలిపాడు. అందరూ అనుకుంటున్నట్లు ఫిట్‌నెస్ నన్ను అందరి ముందు చక్కగా చూపిస్తుందని నేనెప్పుడు కష్టపడలేదు. అలాంటి నమ్మకం లేని మాటలు ఎప్పుడూ చెప్పలేదు. అక్షరాలా చెప్పాలంటే ఫిట్‌నెస్ మన మానసిక స్థాయిని కూడా మార్చుతుంది. నువ్వెలా భావిస్తున్నావు. నువ్వెంత చేయగలవోననేది ఫిట్‌నెస్ ద్వారానే తెలుస్తుంది.

అందంగా కనిపించాలని ప్రయత్నించను

అందంగా కనిపించాలని ప్రయత్నించను

నేనేదో అందంగా కనిపించాలని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నించను. ఫిట్‌గా ఉండాలని మాత్రమే ప్రయత్నిస్తా. దానికి తగ్గట్టుగా ఫిట్‌నెస్‌తో నా వృత్తిపరంగా కూడా కొన్ని అవసరాలుంటాయి. తొలినాళ్లలో ఈ ఫిట్‌నెస్ నన్నింతగా మారుస్తుందని నేను కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడది నా లైఫ్ స్టైల్‌లో భాగమైపోయింది.

నవంబరు 21నుంచి ఆస్ట్రేలియాతో

నవంబరు 21నుంచి ఆస్ట్రేలియాతో

కోహ్లీ తన తొలినాళ్లలో ఫిట్‌నెస్‌ను చక్కగా కనిపించేందుకు మాత్రమే మొదలుపెట్టాడు. అతనికది క్రమేపి సీరియస్‌గా పరిణమించింది. అది కాస్తా అతని ఆటతీరులోనూ పెనుమార్పులు తెచ్చిపెట్టింది. విరామంలో ఉన్న టీమిండియా కెప్టెన్ ఆస్ట్రేలియా పర్యటనలో నవంబరు 21నుంచి జరగనున్న మ్యాచ్ నుంచి అందుబాటులోకి రానున్నాడు.

Story first published: Monday, November 12, 2018, 12:31 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X