న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా వెంట భార్యలను కూడా అనుమతించండి: కోహ్లీ

Virat Kohli wants BCCI to change rule: Let wives stay for full overseas tours

న్యూఢిల్లీ: విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్‌ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బీసీసీఐని కోరాడు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. చాలా దేశాలు తమ ఆటగాళ్ల వెంట భార్యలు, స్నేహితురాళ్లను తీసుకెళ్లడంపై నిబంధనలు విధించాయి.

బీసీసీఐ కార్యవర్గం ఏర్పడ్డ అనంతరమే నిర్ణయం

బీసీసీఐ కార్యవర్గం ఏర్పడ్డ అనంతరమే నిర్ణయం

ఈ అంశాన్ని కోహ్లీ మొదట ఓ బీసీసీఐ ఉన్నతాధికారి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అనంతరం ఆ అధికారి ఈ విషయాన్ని వినోద్‌రాయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీకి చెప్పారు. ఇందుకు సంబంధించి అధికారికంగా అభ్యర్థనను పంపాలని టీమిండియా మేనేజర్‌ సునీల్‌ సుబ్రహ్మణ్యాన్ని పాలకుల కమిటీ అడిగినట్లు సమాచారం. అయితే దీనిపై పాలకుల కమిటీ కొత్త బీసీసీఐ కార్యవర్గం ఏర్పడ్డ అనంతరమే నిర్ణయం తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది.

కొన్ని వారాల క్రితమే భార్యలను అనుమతించాలని:

కొన్ని వారాల క్రితమే భార్యలను అనుమతించాలని:

‘విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలనే అభ్యర్థన కొన్ని వారాల క్రితమే వచ్చింది. అయితే ఇది బీసీసీఐ విధాన నిర్ణయం కావున ఇందుకు సంబంధించి అభ్యర్థనను మేనేజర్‌ పంపాల్సి ఉంటుంది. కోహ్లీతో కలిసి అనుష్క విదేశీ పర్యటనలకు వెళ్తోంది. అయితే పాత నిబంధనలను మార్చి టూర్‌ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలని కోహ్లీ కోరుతున్నాడు.' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

272 పరుగుల తేడాతో ఘోరంగా విఫలమై..

272 పరుగుల తేడాతో ఘోరంగా విఫలమై..

మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. కెప్టెన్ విరాట్ కోహ్లి (139), పృథ్వీ షా (134): , రవీంద్ర జడేజా (100 నాటౌట్) సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్‌ని 649/9 వద్ద డిక్లేర్ చేయగా.. ఆ తర్వాత వెస్టిండీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ అయింది. రాజ్‌కోట్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన వెస్టిండీస్ జట్టు భారత్ చేతిలో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

 శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్

శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాబోయే శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు వన్డే, టీ20 సిరీస్‌లో పోటీ పడనున్నాయి. పిచ్ వాతావరణాన్ని బట్టి నీరు తాగేందుకు ఆటగాళ్లకు విరామం ఇవ్వాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐని కోరాడు.

1
44264
Story first published: Sunday, October 7, 2018, 14:51 [IST]
Other articles published on Oct 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X