న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మణికొండలో విరాట్ కోహ్లీ సందడి.. యాడ్ షూట్ కోసం..!

 Virat Kohli Spotted at Manikonda Gym for Ad Shoot goes viral

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మణికొండలో సందడి చేశాడు. ఓ యాడ్ షూటింగ్ కోసం కోహ్లీ కారులో ఈ ప్రాంతానికి వచ్చాడు. కారులో నుంచి దిగిన కోహ్లీ.. షూటింగ్ కోసం జిమ్‌లోకి వెళ్తున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
గ్రీన్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లోని హైకీ జిమ్‌లో కోహ్లీ యాడ్ షూట్‌లో పాల్గొన్నాడు. దీంతో విరాట్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు జిమ్ దగ్గర గూమికూడారు. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెట్లు దిగుతూ వచ్చిన క్రికెటర్‌ను చూసిన అభిమానులు కోహ్లీ.. కోహ్లీ.. అంటూ నినాదాలు చేశారు.

విరాట్ కోహ్లీకి హైదరాబాద్ పోలీసులతో పాటు వ్యక్తిగత సిబ్బంది భారీ భద్రతా ఏర్పాటు చేశారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌ కోసం భారత జట్టు హైదరాబాద్‌‌కు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు పలువురు టీమిండియా ఆటగాళ్లు టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. శుభ్‌మన్ గిల్, చాహల్, సూర్య, ఇషాన్ కిషన్ తదితరులు మ్యాచ్‌కు ముందు ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలు బాది మళ్లీ మునుపటి ఫామ్‌ను అందుకున్న విరాట్ కోహ్లీ.. హైదరాబాద్ వన్డేలో మాత్రం విఫలమయ్యాడు. 8 పరుగులే చేసి సాంట్నర్ స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్(149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208) ఒక్కడే డబుల్ సెంచరీతో
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 337 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్(78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140) విధ్వంసకర సెంచరీతో వణికించాడు. భారత బౌలర్లలో సిరాజ్‌ నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షమీ, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.

Story first published: Thursday, January 19, 2023, 15:44 [IST]
Other articles published on Jan 19, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X