న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అది సిక్సే: అంపైర్‌లా సిగ్నల్ ఇస్తున్న కోహ్లీ(వీడియో)

india vs Australia 2018-19: Kohli Acts Like Umpir For Six During Practice | Oneindia Telugu
 Virat Kohli signals its a 6 after hitting bowler for the maximum in nets ahead of IND - AUS 1st T20I

హైదరాబాద్: సుదీర్ఘ పర్యటనకి ఆస్ట్రేలియా గడ్డపై బుధవారం తొలి టీ20తో భారత్ జట్టు శ్రీకారం చుట్టనుంది. రెండు నెలల పాటు జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తొలి మ్యాచ్‌కు సిద్ధమైపోయింది. ఈ క్రమంలో నవంబరు ఆదివారం జరగనున్న మొదటి టీ20 ఆడేందుకు టీమిండియాను ప్రకటించేసింది బీసీసీఐ. బ్రిస్బేన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకి జరగనున్న ఈ టీ20 కోసం టీమిండియా తెగ కష్టపడుతోంది.

ఆసీస్ గడ్డపై అనుభవం సాధించేందుకు రెండు రోజుల నుంచి అక్కడ నెట్స్‌లో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండో రోజులో భాగంగా సోమవారం ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తరహాలో నెట్స్‌లో హిట్టింగ్ ప్రాక్టీస్ చేశాడు. మూడు రోజు కూడా శిక్షణలో పాల్గొన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బంతిని స్టాండ్స్‌లో బాదుతూ కనిపించాడు.

ఈ క్రమంలో బౌలర్ విసిరిన ఓ బంతిని హిట్ చేసిన విరాట్ కోహ్లి.. అనంతరం అంపైర్ తరహాలో 'సిక్స్'సిగ్నల్ ఇస్తూ అతని షాట్‌పై ధీమాను వ్యక్తం చేశాడు. మరో రకంగా చూస్తే అది ప్రాక్టీసులో సహచర ఆటగాళ్లను ప్రోత్సహించే విధంగా చేశాడని కూడా అనుకోవచ్చు. ఆసీస్ గడ్డపై భారత్ మొత్తం 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలను ఆడనుంది. ఈ నేపథ్యంలో గత శనివారమే అక్కడికి చేరుకున్న టీమిండియా.. పరిస్థితులపై అవగాహన తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

బ్రిస్బేన్ పిచ్ సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకి ఎక్కువగా అనుకూలించనుంది. ముఖ్యంగా.. పొడవైన ఆసీస్ బౌలర్లకి ఈ పిచ్ స్వర్గధామం. దీంతో.. వారి బౌన్సర్లకి సమాధానం చెప్పాలంటే.. ఓపికగా ఆడటంతో పాటు హిట్టింగ్‌కి కూడా వెనకాడకూడదని భారత్ భావిస్తోంది. ఈ విషయంలో రోహిత్ శర్మ మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.

Story first published: Tuesday, November 20, 2018, 17:03 [IST]
Other articles published on Nov 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X