న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండోర్ టీ20.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు వచ్చాడో చెప్పిన కోహ్లీ!!

Virat Kohli says I want to play at three and four to figure out both positions

ఇండోర్: దశాబ్ద కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో శ్రీలంకపై ఆధిపత్యం కనబరుస్తున్న టీమిండియా కొత్త ఏడాది కూడా అదే జోరు కొనసాగించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం హోల్కర్‌ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యంను భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్‌లోనే ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌ (45; 32 బంతుల్లో 6 ఫోర్లు), శిఖర్‌ ధావన్‌ (32; 29 బంతుల్లో 2 ఫోర్లు), శ్రేయస్‌ అ‍య్యర్‌ (34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్ కోహ్లీ ( 30 నాటౌట్‌; 17 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌) విజయంలో కీలకపాత్ర పోషించారు.

గడ్డుకాలంలో ఉన్న ముంబై జట్టుతో రోహిత్‌ ముచ్చట్లు.. ఆటగాళ్లకు సూచనలు!!గడ్డుకాలంలో ఉన్న ముంబై జట్టుతో రోహిత్‌ ముచ్చట్లు.. ఆటగాళ్లకు సూచనలు!!

నాలుగో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్‌:

నాలుగో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్‌:

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాములుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. అయితే ఇండోర్ టీ20లో మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ మూడో స్థానంలో వచ్చాడు. ఆపై నాలుగో స్థానంలో కోహ్లీ వచ్చాడు. ఇద్దరూ కలిసి లంక బౌలర్లపై విరుచుకుపడి టీమిండియాను లక్ష్యంకు చేరువ చేశారు. చివర్లో అయ్యర్‌ పెవిలియన్ చేరినా.. రిషబ్ పంత్ అండతో కోహ్లీ మ్యాచ్‌ను ముగించాడు.

అందుకే నాలుగో స్థానంలో వచ్చా:

అందుకే నాలుగో స్థానంలో వచ్చా:

మ్యాచ్‌ అనంతరం నాలుగో స్థానానికి రావడానికి గల కారణాలను కోహ్లీ చెప్పాడు. 'జట్టు విజయాలపై ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అయ్యర్‌ను మూడో స్థానంలో పంపిచా. ఒత్తిడిలో మ్యాచ్‌ను ముగించడానికి యువ ఆటగాళ్లు అలవాటుపడాలి. అందుకే వారికి అవకాశాలు ఇవ్వాలనుకున్నా. నేను మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయగలను. వాంఖడేలో వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో కూడా నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చా' అని కోహ్లీ తెలిపాడు.

అందుకే కుల్‌దీప్‌, సుందర్‌ను తీసుకున్నాం:

అందుకే కుల్‌దీప్‌, సుందర్‌ను తీసుకున్నాం:

జడేజా, చాహల్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై స్పందిస్తూ... 'లంక జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. అందుకే కుల్‌దీప్‌, సుందర్‌ను తీసుకున్నాం. ఇద్దరు బాగా బౌలింగ్‌ చేశారు. ప్రత్యర్థి జట్టులో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా ఉంటే జడేజా, చాహల్‌కు అవకాశం ఇచ్చే వాళ్లం. ఒక కెప్టెన్‌గా టీ20 జట్టులో ఐదుగురు కంటే ఎక్కువ బౌలర్లు ఉండాలని నేను అనుకుంటా' అని కోహ్లీ పేర్కొన్నాడు.

మా బౌలర్లు అద్భుతం:

మా బౌలర్లు అద్భుతం:

'ఇండోర్ వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. తక్కువలో తక్కువ 175 పరుగులు చేయవచ్చు. కానీ.. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. వికెట్లు తీస్తూ స్కోరు బోర్డును కట్టడి చేశారు. బుమ్రా తిరిగి జట్టులోకి రావడం బాగుంది. ఈ మ్యాచ్‌లో నవదీప్‌ సైనీ అదరగొట్టాడు. ఇది భారత జట్టుకు శుభసూచకం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. చివరి మ్యాచ్‌ శుక్రవారం పుణెలో జరగనుంది.

Story first published: Wednesday, January 8, 2020, 12:51 [IST]
Other articles published on Jan 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X