న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరి హద్దుల్లో వాళ్లుంటే మంచిది.. తేడాలొస్తే తగ్గే ప్రసక్తే లేదు: కోహ్లీ

Virat Kohli promises line wont be crossed but dont want contest to be mundane

అడిలైడ్‌: భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య మరి కొద్ది గంటల్లో టెస్టు సిరీస్‌ ఆరంభం కానున్న తరుణంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడాడు. ఈ సందర్భంగా రెండు జట్ల ఆటగాళ్లు మైదానంలో హద్దు దాటి ప్రవర్తించడానికి వీల్లేదని విరాట్‌ తెలిపాడు. అదే సమయంలో భావోద్వేగాలను అణచుకోవాల్సిన అవసర్లేదని సూచించాడు. బుధవారం అడిలైడ్‌లో జరిగిన ప్రెస్‌ మీట్‌లో మొదటి టెస్టులో ఆడనున్న 12మంది ఆటగాళ్ల పేర్లను కోహ్లీ ప్రకటించాడు.

 బౌలర్లు బంతులు విసిరేస్తారని

బౌలర్లు బంతులు విసిరేస్తారని

‘గతంలో కనిపించినట్టు 2 జట్లూ హద్దు మీరి ప్రవర్తించడం లేదు. అయినప్పటికీ బలబలాల దృష్ట్యా పోటీ తీవ్రంగానే ఉంటుంది. బౌలర్లు పరుగెత్తుకు వచ్చి బంతులు విసిరేసి వెళ్లిపోవాలని కోరుకోవడం లేదు' అని విరాట్‌ అన్నాడు. ఐసీసీ నియమావళి ఉల్లంఘించకుండా రెండు జట్లూ కవ్వించుకోవడంలో, గిల్లికజ్జాలు పెట్టుకోవడంలో తప్పులేదని విరాట్‌ వెల్లడించాడు.

ఆస్ట్రేలియా ఇప్పటికీ బలమైన జట్టే

ఆస్ట్రేలియా ఇప్పటికీ బలమైన జట్టే

‘క్రీజులో బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడి చేయాల్సిన సమయం వస్తుంది. హద్దు దాటకుండా అతడిని కవ్వించడంలో తప్పులేదు. అయితే గతంలో జరిగిన స్థాయిలో ఇరు జట్ల ప్రవర్తన ఉండొద్దు' అని విరాట్‌ అన్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ తరహా ఘటన జరిగినప్పుడు ఏ జట్టైనా ఆత్మవిశ్వాసం కోల్పోతుందని పేర్కొన్నాడు. జట్టు సంస్కృతిని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నాడు. నైపుణ్యపరంగా చూస్తే ఆస్ట్రేలియా ఇప్పటికీ బలమైన జట్టే అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

స్వదేశంలో ఏ జట్టూ బలహీనం కాదనేది

స్వదేశంలో ఏ జట్టూ బలహీనం కాదనేది

‘ఏ జట్టైనా స్వదేశంలో బలహీనం కాదనేది నా అభిప్రాయం. ప్రస్తుత జట్టు బలంగా లేదని అనుకోలేం. నైపుణ్యం గల ఆటగాళ్లు ఇంకా ఆ జట్టులో ఉన్నారు. ఇప్పటికీ వారు ప్రత్యర్థి జట్లపై స్వదేశంలో ఆధిపత్యం ప్రదర్శించగలరు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ప్రతిసారి అదే ప్రదర్శన

ప్రతిసారి అదే ప్రదర్శన

అడిలైడ్‌ మైదానం గురించి మాట్లాడుతూ.. తన ఆట గురించి ప్రస్తావించాడు. ‘ఈ గ్రౌండ్‌, ఈ నగరం అంటే చాలా ఇష్టం. ఒక మైదానంలో కొన్ని సార్లు బాగా ఆడినంత మాత్రాన, ప్రతిసారి అదే ప్రదర్శన చేయలేకపోవచ్చు' అంటూ విరాట్‌ వ్యాఖ్యానించాడు.

Story first published: Wednesday, December 5, 2018, 17:00 [IST]
Other articles published on Dec 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X