న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

10000 పరుగుల క్లబ్‌లోకి కోహ్లీ!: మిగిలిన ఆ నలుగురు ఎవరు?

Virat Kohli on the cusp of joining Club 10000; glance at his club mates from India

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా భారత్-వెస్టిండిస్‌ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. ఈ వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మక మైలురాయికి చేరువగా ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించడానికి కోహ్లీ మరో 81 పరుగుల దూరంలో ఉన్నాడు.

<strong>విశాఖ వన్డేలో ఓపెనర్లు ఔట్: ఆచితూచి ఆడుతోనన కోహ్లీ, రాయుడు</strong>విశాఖ వన్డేలో ఓపెనర్లు ఔట్: ఆచితూచి ఆడుతోనన కోహ్లీ, రాయుడు

కోహ్లీ ఈ మైలురాయిని గనుక అందుకుంటే వన్డేల్లో పది వేల పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. ప్రస్తుత వన్డే ముందు వరకు కోహ్లీ 212 వన్డేలాడి 58.69 యావరేజితో 9,919 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా గంగూలీ 263, రికీ పాంటింగ్‌ 266 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. సచిన్‌ టెండూల్కర్ (259 ఇన్నింగ్స్‌) పేరిట ఉన్న రికార్డును విశాఖలో కోహ్లీ తిరగరాస్తాడేమో చూడాలి. కోహ్లీకి ఈ స్టేడియంలో అద్భుతమైన రికార్డు ఉంది.

1
44267

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక, కోహ్లీ కంటే ముందు భారత్ తరుపున పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆ నలుగురు ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిస్తే....

1. సచిన్ టెండూల్కర్ - 18426

1. సచిన్ టెండూల్కర్ - 18426

కెరీర్ తొలినాళ్లలో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ క్రికెట్ లెజెండ్ 90ల్లో న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ప్రమోటయ్యాడు. ఇందుకు కారణం రెగ్యులర్ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మెడనొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన కారణంగా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో పాటు అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు వన్డేల్లో పది వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

2. సౌరవ్ గంగూలీ - 11363

2. సౌరవ్ గంగూలీ - 11363

టీమిండియా మాజీ కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ 1990 మధ్య కాలం నుంచి 2000 మొదటి వరకు వన్డేల్లో భారత జట్టుకు అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాలను నెలకొల్పాడు. సచిన్ టెండూల్కర్‌తో కలిసి సౌరవ్ గంగూలీ నెలకొల్పిన రికార్డులు అనేకం. వీరిద్దరి ఓపెనింగ్ జోడీని విడగొట్టేందుకు దిగ్గజ పేసర్లు సైతం చెమటొడ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌లో వీరిద్దరి జోడీ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా పేరు తెచ్చుకుంది. వీరిద్దరూ కలిసి 136 ఇన్నింగ్స్‌ల్లో 6609 పరుగులు చేశారు.

3. రాహుల్ ద్రవిడ్ - 10889

3. రాహుల్ ద్రవిడ్ - 10889

కెరీర్ తొలి నాళ్లలో వన్డేల్లో నిలదొక్కుకునేందుకు రాహుల్ ద్రవిడ్‌కు చాలా సమయం పట్టింది. అయితే, ఆ తర్వాత వీటన్నింటిని అధిగమించి తన అద్భుతమైన ఆటతీరుతో రాహుల్ ద్రవిడ్ వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్ల జాబితాలో కపిల్ దేవ్, యువరాజ్‌లతో సంయుక్తంగా ఉన్నాడు. 2003లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు.

 4. మహేంద్ర సింగ్ ధోని - 10079

4. మహేంద్ర సింగ్ ధోని - 10079

భారత్ తరుపున పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో క్రికెటర్‌గా ధోని ఇటీవలే ఈ జాబితాలో చేరాడు. 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే ధోని పది వేల పరుగుల మైలురాయిని అందుకోవడం ఆశ్చర్యమే. అంతేకాదు ధోని యావరేజి సైతం 50.90 క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ధోని... వికెట్ కీపర్‌గా కూడా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Story first published: Wednesday, October 24, 2018, 15:28 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X